Taj Mahal: ఈ ప్రపంచంలో ఎన్నో రహస్య గదులు ఉన్నాయి. వాటిని తెరవరు? అలాగే తెరిచే ధైర్యం కూడా చేయరు? అలాంటి గదులు మన ఇండియాలో కూడా ఉన్నాయాంటే నమ్ముతారా? మీరు చదువుతున్నది నిజమే. మన దేశంలో కూడా ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి.
ఆ ప్రదేశం మరేదే కాదు? ఆగ్రా లోని తాజ్ మహల్.
తాజ్ మహల్ లో సీక్రెట్ రూమ్ ఉందా?
మన ఇండియాలోని తాజ్ మహల్ లో కూడా ఒక రహస్య గది ఉంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఇది కూడా ఒకటి. అయితే, దీని కింద ఎవరికి తెలియని ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ఆ గదికి ఎవర్ని పంపించరు. ఎవరూ కూడా ఇంత వరకు దీన్ని తెరవలేదు. తెరిచే సాహసం కూడా చేయలేదు. అయితే, ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధ్యాత్మికంగా ఇక్కడ ఏదో ఉందని చెబుతున్నారు. కానీ, సైన్స్ దాన్ని కొట్టి పారేస్తూ షాకింగ్ విషయాలను బయట పెట్టింది.
ఆధ్యాత్మికంగా ఏం చెబుతున్నారంటే?
కొందరు ఈ తాజ్ మహల్ కింద శివాలయం ఉందని అంటున్నారు. దాన్ని కూల్చి వేసి తాజ్ మహల్ ని కట్టారని అంటున్నారు. మరి కొందరు షాజహాన్ భార్య అయినా ముంతాజ్ డెడ్ బాడీని ఈ అండర్ గ్రౌండ్ లో రూమ్ లోనే దాచి పెట్టారని చెబుతున్నారు. కానీ, శాస్త్రవేత్తలు కొన్ని నమ్మలేని నిజాలను బయట పెట్టారు.
సైన్స్ ఏం చెబుతుందంటే?
తాజ్ మహల్ కింద ఒక అంతు చిక్కని గది ఉంది. కార్బన్ డై ఆక్సైడ్ ఆ గదిని పూర్తిగా కప్పేసింది. తాజ్ మహల్ ని మార్బుల్స్ తో తయారు చేయడం వలన ఆ గదిని తెరిస్తే అది మార్బుల్స్ తో రియాక్ట్ అయి కాల్షియం కార్బోనేట్ గా మారి తాజ్ మహల్ మొత్తం పగుళ్ళు ఏర్పడే అవకాశం ఉందని, దాని వలనే ఆ గదిని శాశ్వతంగా మూసి వేశారని చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా తెరిచే ప్రయత్నం చేయరని చెబుతున్నారు.
