Swetcha Effect (IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ ప్రత్యేక కథనంతో.. బెల్ట్ షాపులపై స్పందించిన జిల్లా ఎస్పీ!

Swetcha Effect: జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలతో బెల్ట్ షాపులపై గద్వాల పోలీసులు (Gadwal police) కొరడా జులిపించారు.  ఆకస్మికంగా దాడులు చేసి మధ్యాన్ని సీజ్ చేశారు. గద్వాల పట్టణంలోని పాత కూరగాయల దుకాణం దగ్గర వైన్ షాప్ సమీపంలో ఉదయం నుంచే అక్రమంగా మద్యాన్ని అమ్ముతుండగా గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 20 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకొని వైన్ షాప్ సమీపంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వెంకటేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అనుమతిలిచ్చేది మీరే.. శిక్షించేది మీరే అనే స్వేచ్ఛ కథనానికి జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. ఈ మేరకు జిల్లాలోని ఎస్ఐలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. రైస్‌ మిల్లు పై సివిల్ సప్లై అధికారుల దాడులు

పోలీస్ స్టేషన్ ను సందర్శించి బెల్ట్ షాపుల వ్యవహారంపై ఆరా

ఈ నేపథ్యంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సందర్శించి బెల్ట్ షాపుల వ్యవహారంపై ఆరా తీశారు. ఉదయం నుంచే పాత కూరగాయల మార్కెట్ షాప్ ల మధ్య కాళీ ప్రదేశంలో మద్యానికి బానిసైన కొందరు యువకులు, మేస్త్రి పని చేసే కూలీలు ఉదయాన్నే టీ కి బదులు ఆల్కహాల్ కు అలవాటు పడ్డారు. అంతేగాక తాగిన మైకంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సైతం కొందరు యువకులు పాల్పడ్డారు. కొందరికి మద్యం సేవించకపోతే చేతుల వేలు షేక్ అయ్యే పరిస్థితికి దాపురించాయి. జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు ప్రధాన రహదారి గుండా అక్రమంగా మద్యాన్ని అందుబాటులో ఉంచి విక్రయిస్తూ వాటిని సేవించడం ద్వారా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే దాబాలో మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ యంత్రాంగమంతా ఉన్నా అక్రమ మద్యం దందా? 

అలాగే గద్వాల మండలంలోని కురవపల్లి స్టేజ్, నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ ఆలయ సమీపంలో సైతం ప్రధాన రహదారి ముఖద్వారం పక్కల, రోడ్ కి అవతలి భాగంలో ఉన్న కొన్ని షాపులలో సిట్టింగ్లకు అవకాశం కల్పిస్తున్నారని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ యంత్రాంగమంతా ఉన్నా అక్రమ మద్యం దందా కొనసాగిస్తుండగా 44వ జాతీయ రహదారి గుండా,మండల, గ్రామీణ ప్రాంతాలలో ఏ స్థాయిలో మందు మాఫియా విస్తరించిందో అర్థమవుతోంది. కొందరు అక్రమ మార్గంలో సంపాదనకు అలవాటు పడ్డ మద్యం మాఫియా యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘించి మద్యం అందుబాటులో ఉంచడంతో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టి, నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. శ్రీ ఆదిత్య భవన నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా యంత్రాంగం

Just In

01

CM Revanth Reddy: రాష్ట్రంలో అన్ని శాఖలపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. సీఎం వార్నింగ్..?

Harish Rao: ఆటో డ్రైవర్లు అంటే పట్టదా.. హమీ ఇచ్చి పట్టించుకోరా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Bigg Boss 9 Telugu: అంత ఓవరాక్షన్ అవసరమా.. రమ్య మోక్ష ఎలిమినేషన్ పై నెటిజెన్స్ రియాక్షన్ ఇదే..!

Kishan Reddy: జూబ్లీ హిల్స్‌లో నామినేషన్ తర్వాత కనిపించని బీజేపి నాయకులు

Tragedy Love Story: ఐదు రోజుల్లో పెళ్లి.. ప్రియురాలిని మింగేసిన గోదావరి.. లవ్ స్టోరీలో తీవ్ర విషాదం