kanthara-diwali-trailer( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Kantara 1 Diwali trailer: ‘కాంతార చాప్టర్ 1’ దివాళీ ట్రైలర్ వచ్చేసింది చూశారా..

Kantara 1 Diwali trailer: దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్ల పరంపర ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దీపావళి సందర్భంగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు. 2022లో విడుదలై ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చింది ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1’. రిషబ్ శెట్టి  దర్శకుడిగా, రచయితగా, నటుడిగా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 2, 2025న విడుదలైన ఈ చిత్రం, మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా ఉంటూ, కర్ణాటక గ్రామీణ సంస్కృతి, భూత కోళ, ప్రకృతి ఆరాధనలను మరింత లోతుగా చూపిస్తుంది. రిషబ్ శెట్టి విజన్, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, హోంబాలే ఫిల్మ్స్ నిర్మాణం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా ప్రపంచంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించడమే కాకుండా, ప్రాంతీయ సినిమాల అవకాశాలను విస్తరింపజేస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు గొడుతుందో చూడాలి మరి.

Read also-Vijay Deverakonda: క్రియేటివ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ పడిందా?

కథాంశం

సినిమా 2022 ‘కాంతార’ సంఘటనలకు కొన్ని శతాబ్దాల ముందు జరిగిన కథను చెబుతుంది. శివుడి తండ్రి భూత కోళ చేసిన ప్రదేశం ఎలా ఏర్పడింది, దాని వెనుక ఉన్న లెజెండ్ ఏమిటి అనే అంశాలపై దృష్టి సారిస్తుంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ, గ్రామీణ యోధుడి బలిదానం, ప్రకృతితో మనుషుల మధ్య సంబంధాలను అద్భుతంగా చూపిస్తాడు. జయరామ్, రుక్మిణి వాసంత్, గుల్షన్ దేవయ్యలు కీలక పాత్రల్లో మెరిసి, సినిమాకు మరింత ఆకర్షణ నిలుస్తారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి గ్లోబల్ స్టార్ అయిపోయారు. విదేశాల్లో ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసిన క్లబ్ లో చేరిపోయింది.

Read also-Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?

బాక్సాఫీస్ విజయం

‘కాంతార చాప్టర్ 1’ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు బద్దులుగొడుతోంది. బ్లాక్‌బస్టర్ టాక్ తో విడుదలైన 14 రోజుల్లోనే సినిమా భారీ విజయం సాధించింది. భారతదేశంలో 13వ రోజున రూ.10 కోట్లు సంపాదించి, దేశీయ కలెక్షన్ రూ.475.90 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా 13వ రోజున రూ.650 కోట్ల మార్క్‌ను దాటి, 2025లో ఈ మార్కును దాటిన రెండో ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. కర్ణాటకలో రూ.183 కోట్ల గ్రాస్ సాధించి, రాష్ట్రంలో అత్యధిక గ్రాసర్‌గా మారింది. అక్కడ రూ.200 కోట్ల వైపు పయనిస్తోంది. ఇది ఎస్‌ఎస్ రాజమౌళి ‘బాహుబలి: ది బిగినింగ్’ లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను మించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.700 కోట్ల వైపు దూసుకెళ్తోంది. మొదటి వీకెండ్ తర్వాత కొంత డ్రాప్ ఉన్నప్పటికీ, రూ.500 కోట్ల మార్క్‌ను దాటేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పోల్చితే, మొదటి రెండు వారాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!