BC Reservation (image credit: twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Reservation: రిజర్వేషన్లపై నేడు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

BC Reservation: బీసీ రిజర్వేషన్లకు (BC Reservation) సంబంధించిన అంశంపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ మద్దతును ప్రకటించాయి. ఆ తరువాత బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Also ReadBC Reservation: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు ఇచ్చిన సలహా ఇదే!

సుప్రీం కోర్టు ఛీఫ్​ జస్టిస్​ నేతృత్వంలోని ధర్మాసనం

దీనిని సవాల్​ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై స్టే విధించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్​ పిటిషన్​ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్  రిజిస్ట్రీలో లిస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఛీఫ్​ జస్టిస్​ నేతృత్వంలోని ధర్మాసనం నేడు దీనిపై విచారణ చేయనుంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్నదానిపై రాష్ట్ర ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.

Also ReadSLBC Project: ఎస్ఎల్‌బీసీ పనులపై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..