KTR: బీసీ రిజర్వేషన్లకు మా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నానికి మా పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 18న బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు మా పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీజేఏసీ నాయకులు కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని కచ్చితంగా మా పార్టీ తరఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. బీసీ రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటామన్నారు.
Also Read: KTR: ఫేక్ ఓట్లను తొలగించకపోతే కోర్టుకు వెళ్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోంది
జాతీయ స్థాయిలో ఓబీసీ సంక్షేమ శాఖ ఉండాలని కోరిన ఏకైక తొలి నాయకుడు కేసీఆర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై మా పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పామని, గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెప్పారని, ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మేము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదు
కాంగ్రెస్ తెచ్చిన 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ కి బీసీల అంశంలో ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుందన్నారు. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుందన్నారు. బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పీఎం మోడీ దగ్గరికి తీసుకెళ్తే మేము వచ్చి మద్దతు ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామన్నారు.
Also Read: KTR: బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అంటూ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
