Teeth ( Image Source: Twitter )
Viral

Toothache Remedies: పంటి నొప్పితో బాధ పడుతున్నారా? అయితే, ఈ చిట్కాలతో తగ్గించుకోండి!

Toothache Remedies: పంటి నొప్పి అనేది మన శరీరంలో ఏ ఇతర నొప్పితో పోల్చినా సులభంగా భరించలేని బాధ. ఈ నొప్పి అనుభవించిన వారికి మాత్రమే దాని తీవ్రత తెలుసు . దీన్ని ఎవరూ కూడా భరించలేరు. కొన్నిసార్లు పళ్లన్నీ రాళ్ళతో కొట్టు కోవాలనుకునేంత కోపం వస్తుంది. నిద్ర రాదు, ఆకలి వేయదు, నీళ్లు తాగుతున్న కూడా నొప్పి గా ఉంటుంది. అంత నరకంగా ఉంటుంది. మాత్రలు వేసుకుంటే కొంతసేపు ఉపశమనం లభిస్తుంది, కానీ మళ్లీ నొప్పి మొదలవుతుంది. “ఇంతకన్నా పెద్ద నరకం ఇంకోటి ఉండదు.” అనిపిస్తుంది.సాధారణంగా చిగుళ్ల వాపు, పళ్ళు పుచ్చినప్పుడు పంటి నొప్పి వస్తుంది.

పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ సమస్య తో బాధ పడుతారు. అయితే, నొప్పి మాత్రలు తరచూ వాడటం కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఎలాంటి ట్యాబ్లేట్ లేకుండా మన వంటగదిలోనే పంటి నొప్పికి తాత్కాలిక ఉపశమనం కలిగించే సహజ చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉల్లిపాయ

ఉల్లిపాయ కేవలం రుచి కోసమే కాదు, దానిలో క్రిమినాశక, యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను కట్ చేసి, నొప్పి ఉన్న పంటి దగ్గర పెట్టుకుని నెమ్మదిగా నమిలితే, నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనం కనిపిస్తుంది.

వెల్లుల్లి

ప్రతి ఒక్క వంటింట్లో వెల్లుల్లి తప్పకుండా ఉంటుంది. ఇది మరో అద్భుతమైనదే అని చెప్పుకోవాలి. దీనిలో ఉండే యాంటీ-బాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గిస్తాయి. వెల్లుల్లి రెబ్బను మెత్తగా పేస్ట్ చేసి, దానికి చిటికెడు ఉప్పు కలిపి, ఆ పేస్ట్‌ను నొప్పిగా ఉన్న పంటిపై రాస్తే, వెంటనే ఫలితం కనిపిస్తుంది.

ఉప్పు

నీరు గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం అనేది అందరికీ తెలిసిన సులభమైన చిట్కా. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి, చిగుళ్ల వాపును నియంత్రిస్తుంది. రోజుకు ఇలా మూడు నుంచి నాలుగు సార్లు ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే, పంటి నొప్పి తగ్గుతుంది.

ఐస్ ప్యాక్స్

పంటి నొప్పికి ప్రభావవంతమైన ఇంటి చిట్కాల్లో ఐస్ ప్యాక్ ఒకటి. చల్లని కంప్రెస్ వాడటం వల్ల నరాలు తిమ్మిరెక్కి, నొప్పి తగ్గుతుంది. ఐస్ ముక్కలను ఒక గుడ్డలో చుట్టి, చెంప బయటి భాగంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచితే ఉపశమనం కలుగుతుంది. అదనంగా, పటిక నీటితో పుక్కిలించడం కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఇంటి చిట్కాలు పంటి నొప్పికి తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి.  మీకు నొప్పి ఇంకా ఎక్కువగా ఉంటే దంతవైద్యుడిని సంప్రదించడం మంచిది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!