Bandi kaladhar: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. ఈటల తరఫున ప్రముఖ న్యాయవాది బీజెపి సీనియర్ నాయకులు బండి కళాధర్ (Bandi Kaladhar) లీగల్ నోటీసులు జారీ చేశారు. కమలాపూర్‌లోని ఈటల రాజేందర్ నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో బండి కళాధర్ మాట్లాడుతూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ప్రస్తుతం ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్న ఈటల రాజేందర్ పై కొందరు సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేస్తూ, అవమానకర వ్యాఖ్యలు చేశారు.
Also Read: MP Etela Rajender: ఆత్మగౌరవం కోల్పోయాక పదవి గడ్డిపోచతో సమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
కుటుంబ సభ్యులను కూడా దూషించడం అత్యంత బాధాకరం
అంతేకాక రాజకీయాలకు సంబంధం లేని ఆయన కుటుంబ సభ్యులను కూడా దూషించడం అత్యంత బాధాకరం” అని అన్నారు. వీరిలో భోగం అజయ్ (కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు ) మాట్ల (రాజ్‌కుమార్ హనుమకొండ జిల్లా (Hanumakonda District) కమలాపూర్ జవ్వాజి కుమారస్వామి (సిరిసేడు కరీంనగర్) దాంసాని కుమార్ (ఇల్లంతకుంట) పొంగంటి సంపత్ (జమ్మికుంట) ఎడ్ల రాకేష్( ఎలుబక వీణవంక మండలం) తాళ్లపెల్లి మహేష్ గౌడ్ (వీణవంక) ఉన్నారని వివరించారు.
ఆయన కుటుంబాన్ని కించపరిచే పోస్టులు
వీరు వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా వేదికలలో ఈటల రాజేందర్ మరియు ఆయన కుటుంబాన్ని కించపరిచే పోస్టులు పెట్టారని అందువల్ల ఒక్కొక్కరిపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నామని తెలిపారు. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు స్వాగతించదగ్గవైనా వ్యక్తిగత దూషణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. ఇకపై ఈటల రాజేందర్ గారిపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా కుటుంబాన్ని కించపరిచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కమలాపూర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read: MP Etela Rajender: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆరా..!
