Ilaiyaraaja: సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు బాంబు బెదిరింపు రావడంతో తమిళనాడు (Tamil Nadu)లో మరోసారి భయాందోళనలు రేగాయి. చెన్నై, టి. నగర్‌లోని ఇళయరాజా స్టూడియో (Ilaiyaraaja studio)లో బాంబు పెట్టినట్లు మంగళవారం ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే మెయిల్ డీజీపీ కార్యాలయానికి కూడా రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలు స్టూడియోకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. సోదాల అనంతరం అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ధారించారు. ఒక్క ఇళయరాజా స్టూడియోకే కాదు.. చెన్నైలోని అమెరికా, రష్యా, శ్రీలంక, సింగపూర్ వంటి విదేశీ ఎంబసీ కార్యాలయాలకు (foreign embassies) కూడా ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇవి కేవలం ఫేక్ బెదిరింపు కాల్స్ (Fake Bomb Alerts) అని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read- SYG Glimpse: ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి గ్లింప్స్ రిలీజ్.. బీస్ట్ మోడ్‌లో సాయి దుర్గా తేజ్..
విచారణ వేగవంతం
గత కొన్ని వారాలుగా చెన్నైలోని పలువురు ప్రముఖులకు, విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా ఇదే తరహా బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఈ బెదిరింపుల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నివాసంతో (CM Residence Threat) పాటు పలు ప్రజా స్థలాలకు నకిలీ బెదిరింపులు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వచ్చిన బెదిరింపు కాల్స్ వెనుక కూడా అదే ముఠా ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా నకిలీ బాంబు బెదిరింపులు పదేపదే రావడం నగరంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ విచారణ వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంతకు ముందు కూడా..
ఈ తరహా బెదిరింపు కాల్స్, ఈ స్థాయిలో ఇంతకు ముందు ఎప్పుడూ తమిళనాడు రాష్ట్రం ఫేస్ చేయలేదు. తమిళనాడు రాష్ట్ర సీఎంతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీస్, రాజ్ భవన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కావడం గమనార్హం. అంతేకాదు.. స్టార్ హీరో విజయ్ (Hero Vijay), త్రిష (Trisha), నయనతార (Nayanthara) వంటి స్టార్స్ నివాసాలకు కూడా బెదిరింపు కాల్స్ రావడం, పోలీసులు తనిఖీలు చేపట్టి, ఫేక్ బెదిరింపు కాల్స్‌గా పరిగణించడం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతిసారి ఫేక్ అని తీసేయడానికి లేదు. దీనికి అసలు మూలం ఎక్కడ, ఎవరనేది కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలోనే దీని వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని, ప్రజలను ధైర్యంగా ఉండమని వారు చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
