SYG Glimpse: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల అయ్యాయి. దీనిని సాయి తేజ్ అభిమాని కౌసల్య అమ్మ విడుదల చేశారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) నిలుస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్, పవర్ ఫుల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌కు 18వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో తయారవుతున్న ఈ సినిమా, తేజ్ కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. దీంతో సాయి దుర్గా తేజ్ పాన్ ఇండియా హీరో అవుతాడాని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-Pawan Kalyan wishes Sai Tej: సాయి దుర్గా తేజ్ కు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు.. అందుకేనా?
సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ కథను ప్రపంచ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో అందిస్తుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం, 1947 స్వాతంత్ర్య సమయాన్ని సూచించేలా కనిపిస్తోంది. బ్రిటిష్ కాలంలో జరిగే గొడవలు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డెప్త్, డ్రామా కలిగి ఉంటాయి. తేజ్ ఊచకోత అవతారంలో కనిపించడంతో పాటు, సిక్స్-ప్యాక్ లుక్‌తో అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నారు. మొత్తంగా, ఇది యాక్షన్, థ్రిల్, హిస్టారికల్ ఎలిమెంట్స్ మిశ్రమంగా ఉంటుందని క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Kannappa Television Premiere: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైన ‘కన్నప్ప’.. ఎప్పుడంటే?
గ్లింప్స్ చూస్తుంటే..సాయి దుర్గా తేజ్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తేజ్ కు పాన్ ఇండియా స్థాయిలో లాంచ్ అవ్వడానికి పర్ఫెక్ట్ సినిమాగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్ లను చూస్తుంటే హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తుంది. సుప్రీం హీరో పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ హీరోకు పర్ఫక్ట్ గిఫ్ట్. నీటికోసం పరితపించే ఓ తండాకు నాయకుడిగా సాయి దుర్గాతేజ్ కనిపించారు. ఈ గ్లింప్స్ సాయిధరమ్ తేజ్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా ఉన్నాయి. దర్శకుడు అనుకున్నది ఎక్కడా తగ్గకుండా కంప్టీట్ చేశాడు. డీఓపీ వెట్రివేల్ పలనిసామి అందించిన కెమెరా పనితనం హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సంగీతం అయితే ప్రతి ఫ్రేమ్ కు అతికేట్టుగా అందించారు. సంగీతం ఈ సినిమాకు మరో మెట్టు ముందుకు తీసుకు వెళ్తంది. చివరిలో వచ్చే ‘అసుర సంధ్య వేళ మొదలైంది.. రాక్షసులు ఆగమనం’ డైలాగ్ ఆకట్టుకునేదిలా ఉంది. కంప్లీట్ ప్యాకేజ్ తో సాయి దుర్గాతేజ్ ఈ సారి బాక్సాఫీస్ ను షేక్ చేసేలా కనిపిస్తున్నాడు.
