Pawan Kalyan wishes Sai Tej: మెగా సుప్రీమ్ హీరోకి తెలుగు చిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి కొణెదల పవన్ కళ్యాణ్ సాయి దుర్గాతేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక నోట్ విడుదల చేశారు. అందులో.. ‘యువ కథానాయకుడు, సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ రాసుకొకచ్చారు. దీనిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా హీరో గానే కాకుండా సామాజిక కార్యకర్త గా సమాజానికి ఆయనకు తోచింది ఏదోటి చేస్తుంటారు.
యువ కథానాయకుడు, సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– @PawanKalyan@IamSaiDharamTej #HBDSaiDurghaTej pic.twitter.com/QCYodgfteH
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 15, 2025
Read also-Kannappa Television Premiere: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైన ‘కన్నప్ప’.. ఎప్పుడంటే?
‘సాయి దుర్గా తేజ్ కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్దితో ఆచరించే తత్వం తేజ్ కు ఉంది. చిత్ర పరిశ్రమలో కి వచ్చిన తొలి రోజు నుంచీ ప్రతి రోజూ ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన యువకుడు. వర్తమాన అంశాలపై స్పందిస్తూ.. రహదారి భద్రతా, సోషల్ మీడియాలో అపహాస్య ధోరణులపై చైతన్య పరుస్తున్నాడు. సాయి దుర్గా తేజ్ కథా నాయకుడిగా విజయాలు అందుకోవాలని, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ లేఖలో రాసుకొచ్చారు.
Read also-Kottalokha OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘కొత్త లోక చాప్టర్ 1’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సాయి దుర్గా తెజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రియమైన సాయి ధరమ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ పాజిటివ్ ఎనర్జీ అందరికీ పంచుతుంటావు. ఎప్పుడూ ఇలాగే పాజిటివిటీ పంచుతూ ఈ ఏడాది మంచి జరగాలని కోరుకుంటున్నను’ అని రామ్ చరణ్ రాసుకొచ్చారు. అంతే కాకుండా మంచు మనోజ్..‘ఒక ఘటన జరిగినపుడు ఫిజికల్ గా మెంటల్ గా నువ్వు ఎలా మారావో ఈ జర్నీ అంతా నువ్వు ఎందరికో నిదర్శనం. కొన్ని విషయాల్లో నువ్వే నాకు మోటివేషన్ ఏది ఏమైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చారు. నారా రోహిత్, మెహర్ రమేష్ తదితరులు కూడా సాయి ధరమ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday to my dearest @IamSaiDharamTej ❤️
Keep spreading your positivity and energy wherever you go. Wishing you a fantastic year ahead, brother.
— Ram Charan (@AlwaysRamCharan) October 15, 2025
