daksha( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Daksha OTT release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మంచు లక్ష్మీ ‘దక్ష’ సినిమా.. ఎక్కడంటే?

Daksha OTT release: తెలుగు సినిమా ప్రేక్షకులు మంచు లక్ష్మి అంటే తెలియని వారుండరు. తాజాగా ఆమె నిర్మించి నటించిన చిత్రం ‘దక్ష’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ఫైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన మంచు లక్ష్మి ఫ్యాన్ ఈ సినిమా ఓటీటీ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అంచనాలు మించి మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 19, 2025లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది. తాజాగా ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది. మంచు లక్ష్మి నటన, నిర్మాణం, టీవీ హోస్టింగ్ లాంటి అన్ని విషయాల్లోనూ మెరిసి సుమారు ఐదేళ్ల విరామం తర్వాత ‘దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ’ సినిమాతో తిరిగి వెండి తెరపై తన సత్తా చూపించింది.

Read also-Tollywood controversies: టాలీవుడ్‌లో సినిమా విడుదలకు ముందు కాంట్రవర్సీలు ఎందుకు?.. ఇదంతా పబ్లిసిటీ కోసమా..

ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయి. ఈ చిత్రం, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందింది. సూపర్‌న్యాచురల్ ఎలిమెంట్స్‌తో ఒక ఆసక్తికరమైన కథనం ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా కథలో, లక్ష్మి మంచు ‘దక్ష’ పాత్రలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మెరుస్తుంది. ఒక రహస్యమైన వ్యాధి, అలిన్ లాంటి భయంకర క్రిములు , ఒక డెడ్లీ కాన్స్పిరసీ కలిసి కథనాన్ని మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి. టీజర్‌లోనే ఆమె శక్తివంతమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ వంశీ కృష్ణ మల్లా, ఈ కథనాన్ని టైట్‌గా, సస్పెన్స్‌ఫుల్‌గా తెరకెక్కించారు. మ్యూజిక్ కంపోజర్ ఆచు రాజమణి బీజీఎమ్ తో థ్రిల్‌ను డబుల్ చేశారు. కాస్ట్ విషయంలో, మంచు మోహన్ బాబు కీ రోల్‌లో సినిమాకు వెయిట్ తేవడంలో చాలా ఉపయోగ పడ్డారు. ఆయనతో కలిసి నటించడం లక్ష్మి కి ప్రత్యేక అనుభవంగా నిలుస్తుంది.

Read also-Pawan Kalyan wishes Sai Tej: సాయి దుర్గా తేజ్ కు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు.. అందుకేనా?

సముద్రఖని, సిద్దీఖ్ (మలయాళ నటుడు), విశ్వంత్, చైత్ర శుక్ల – అందరూ సపోర్టింగ్ రోల్స్‌లో బాగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం మంచు ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో ఆమెతో పాటు మోహన్ బాబు నిర్మించారు. 2015 తర్వాత ఈ బ్యానర్ నుంచి వచ్చిన మొదటి రిలీజ్ ఇది. విడుదల తర్వాత, ‘దక్ష’ మంచి రివ్యూస్ సంపాదించింది. లక్ష్మి మంచు ని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఆమె స్టైలిష్ అటిట్యూడ్, గ్రేస్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా పాజిటివ్‌గా తీసుకున్నారు. లక్ష్మి మంచు ఈ సినిమాతో తన నటనను మరింత బలోపేతం చేసుకుంది. కుటుంబ గొడవలు, ట్రోల్స్‌ మధ్య కూడా ఆమె సైలెంట్‌గా పని చేసి, విజయాన్ని సాధించింది. ‘దక్ష’ తెలుగు సినిమాల్లో మహిళా లీడ్ థ్రిల్లర్స్‌కు మరో ఉదాహరణ. ఈ చిత్రం చూసి, లక్ష్మి అభిమానులు మరింత ఎక్సైట్ అవుతున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!