Khammam (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Khammam: ఆ జిల్లాలో పరిమితిని మించి క్వారీ తవ్వకాలు.. రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు?

Khammam: ఏన్కూరు మండలం (Khammam) పరిధిలోని గార్ల ఒడ్డు గ్రామ సమీపంలో ఉన్న కంకర మిల్లులు నిర్వాహకులు తీరుపై గ్రామ ప్రజల్లో తీవ్ర విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. కంకర మిల్లు నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిమితిను మించి లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని,గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాయి కోసం ఓవర్గా బ్లాస్టింగ్ చేస్తున్నారని బ్లాస్టింగ్ చేసినప్పుడు . రాళ్లు దుమ్ము దుమారం పంట పొలాల్లో పడినప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, స్థానికుల ఆరోపిస్తున్నారు,

Also ReadKhammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు

ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లులు

ఈ కంకర మిల్లులు ఊరికి దగ్గరలో ఉండటం వలన బ్లాస్టింగ్ చేసినప్పుడు చాలా ఇల్లు గోడలు క్రాక్ వస్తున్నాయని అలాగే టీవీలో సైతం కాలిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బ్లాస్టింగ్ చేయటానికి వాడే అటువంటి బాంబులో కెమికల్స్ అవి పేలిన సమయంలో గాలిలో పల్ లేట్ అవుతూ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ప్రజలు దుర్వాసన వస్తూ తీవ్ర అనారోగ్యాలకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మక నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, చుట్టూ పచ్చని వాతావరణం ఉండటం వలన మేకల గొర్రెలు మేతకు వెళ్ళినప్పుడు నీటి కోసం అని వెళ్లి క్వారీలో పడి ప్రాణాల కోల్పోతున్నాయని , అయినప్పటికీ వారి వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని , స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు.

రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు?

ఈ క్వారీలలో రాలి తీసుకొని క్రస్సింగ్ చేస్తూ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కంకర మిల్లుకు వెళ్లేటువంటి రహదారి పంట పొలాలకు ఆనుకొని ఉండటం రోజు ఆ రహదారిలో అధిక లోడుతో ట్రిప్పర్లు తిరగడం వలన ట్రిపర్లు వెళ్ళే వేగానికి మట్టి దుమారం గాలికి లేస్తూ ప్రక్కనే ఉన్నటువంటి పంట పొలాల మీద పడుతూ పంట పొలాలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రజలు దారిలో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు

ఓవర్ లోడుతో టిప్పర్లు అతివేగంతో వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు ఏమి పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే టిప్పర్లు అధికలోడులతో వెళుతున్నాయని ప్రజలు అంటున్నారు. రహదారికి వాహనాలు తాకడి ఎక్కువగా ఉండటం వలన ఆ రహదారి అంతా గుంతలు పడి ప్రజలు దారిలో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి అంతే ప్రజలు రైతులు సంబంధిత ఉన్నతాధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని. అధికారుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కంకర మిల్లు నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల కోరుతున్నారు.

Also Read: Khammam District: ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ ఇష్టా రాజ్యం.. ఉద్యోగం ఒకరిది విధుల్లో మరొకరు.. ఎక్కడంటే.?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?