Dammu Srija Re-entry: గతవారం బిగ్ బాస్ తెలుగు నుంచి శ్రీజా దమ్ము ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే శ్రీజాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇదొక అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఆమె ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అటు బిగ్ బాస్ లవర్స్ సైతం.. శ్రీజాను ఇంటి నుంచి బయటకు పంపడాన్ని తప్పుబడుతున్నారు. బిగ్ బాస్ రివ్యూ ఛానళ్లు, పేజీలు సైతం.. శ్రీజా ఎలిమినేషన్స్ పై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీజా చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ దిగివచ్చినట్లు తెలుస్తోంది.
వీకెండ్‌లో శ్రీజా రీఎంట్రీ..!
శ్రీజా రీఎంట్రీకి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వీకెండ్ లో శ్రీజా తిరిగి బిగ్ బాస్ లో అడుగుపెట్టబోతున్నట్లు రివ్యూ పేజీలు పేర్కొంటున్నాయి. తమకు వచ్చిన సమాచారం 100 శాతం నిజమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు శ్రీజా ఫ్యాన్స్ సైతం ఆమె ఎంట్రీ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఆమె తిరిగి వచ్చి.. తన దైన శైలిలో మళ్లీ సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఇదే రీతిలో శ్రీజా దమ్ము తన ఆటను కొనసాగించగలిగితే టాప్ – 5లో ఉండటం ఖాయమని అంటున్నారు.
View this post on Instagram
సమాలోచనల్లో బిగ్ బాస్ టీమ్..
సాధారణంగా బిగ్ బాస్ లో ఎవరైనా ప్రజల ఓట్ల ద్వారానే ఎలిమినేట్ అవుతారు. తక్కువ ఓట్లు వచ్చిన వారిని ప్రతీవారం హౌస్ నుంచి బయటకు పంపేస్తుంటారు. అయితే శ్రీజా దమ్ము విషయంలో అలా జరగలేదు. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన కంటెస్టెంట్స్ శ్రీజాను బయటకు పంపేందుకు ఓట్లు వేశారు. సుమన్ శెట్టి, శ్రీజాలలో ఎవరు ఇంట్లో ఉండాలో తేల్చి చెప్పాలని ఆరుగురు వైల్డ్ కార్డ్స్ ను బిగ్ బాస్ కోరగా.. నలుగురు సభ్యులు సుమన్ శెట్టి వైపు నిలబడ్డారు. దీంతో శ్రీజా అనూహ్యంగా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అటు బిగ్ బాస్ టీమ్ సైతం.. శ్రీజా వెళ్లిపోతుందని ఊహించనట్లు తెలుస్తోంది. అందుకే శ్రీజా ఎలిమినేషన్ సందర్భంగా ఆమె జర్నీ వీడియోను సైతం ప్లే చేయలేదు. శ్రీజా విషయంలో అన్ ఫెయిర్ జరిగిందని బిగ్ బాస్ టీమ్ కూడా భావిస్తోందని.. ఈ వారం ఆమె రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది.
Also Read: Kalvakuntla Kavitha: కేసీఆర్ కింద దుర్మార్గులు ఉన్నారు.. నాదారి నేను వెతుక్కున్నా.. కవిత సంచలన కామెంట్స్
నామినేషన్స్ లో భరణి ఫ్యామిలీ!
ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ లో భరణి ఫ్యామిలీ నిలిచింది. భరణి ఫ్యామిలీ అంటే.. అతడు హౌస్ లో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న ప్రతీ ఒక్కరూ ఈ వారం నామినేషన్ లో ఉండటం గమనార్హం. భరణితో పాటు కూతురు అని చెప్పుకుంటున్న తనూజ, సోదరిగా భావిస్తున్నా దివ్యా, సోదరుడిగా ఉన్న రాము ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే డెమోన్ పవన్ సైతం ఇంటి నుంచి బయటకు వెళ్లే వారి జాబితాలో నిలిచారు. ప్రస్తుతం ఓట్ల పరంగా తనూజ టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భరణి సెకండ్ ప్లేసులో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ వారం దివ్య ఇంటి నుంచి వెళ్లే అవకాశం మెండుగా ఉన్నట్లు సమాచారం.
