Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత (Maganti Sunita) నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav), సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), పద్మరావు అధ్వర్యంలో షేక్ పేట్ మండల కార్యాయంలో ఆమె నామినేషన్ సమర్పించారు. అయితే బీఆర్ఎస్ తరపున ఆమె రెండు సెట్లలో నామినేషన్ సమర్పించడం గమనార్హం.
రెండు విధాలుగా..
మాగటి సునీత మెుదటి సెట్ నామినేషన్ సమర్పిస్తున్న క్రమంలో ఆమె వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డి, దీదప్య రావు ఉన్నారు. రెండో సెట్ నామినేషన్ సమయంలో ఆమె వెంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సమీనా యాస్మిన్ ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు.
షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి,… pic.twitter.com/HrWL9nxzD6
— BRS Party (@BRSparty) October 15, 2025
కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్..
మాగంటి సునీత నామినేషన్ కు ముందు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ లో జరగబోయేది పార్టీలు, వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదని.. పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల అరాచాకానికి మధ్య జరిగేదని పేర్కొన్నారు. ‘జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు.
‘బీఆర్ఎస్ గెలుపునకు ఎదురుచూపు’
జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు కోసం హైదరాబాద్ పేదలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ‘నగరంలో మూతపడుతున్న బస్తీ దావఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని బీసీలు అభిప్రాయపడుతున్నారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజలు పట్టుదలతో ఉన్నారు’ అని కేటీఆర్ అన్నారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ప్రకటన.. దీపక్ రెడ్డిని ఖరారు చేసిన కమలం పార్టీ
‘గోపినాథ్ ఫ్యామిలీకి అండగా ఉండాలి’
దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ కుటుంబానికి ఈ ఉపఎన్నికల్లో ప్రజలు అండగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకోవాలని భావించి.. ఆయన సతీమణి సునీతకు కేసీఆర్ టికెట్ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. సునీత విజయానికి పార్టీలోని కీలక నేతలంతా కృషి చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. అందరి ఆశీర్వాదాలతో సునీత గారు ఎన్నికల్లో గెలవబోతున్నరని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
