Swetcha Effect: శ్రీ ఆదిత్య భవన నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా
Hydraa (imagecredit:swetcha)
సూపర్ ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. శ్రీ ఆదిత్య భవన నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా యంత్రాంగం


Swetcha Effect: చెరువుల పనరుద్ధరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటైంది. కానీ, మూసీ నదిపై అడ్డదిడ్డంగా కడుతున్న శ్రీ ఆదిత్య భవనం(Sri Aditya Bhavan) విషయంలో మాత్రం ఇన్నాళ్లూ కళ్లు మూసేసుకుందన్న విమర్శలు వినిపించాయి. దీనిపై ‘స్వేచ్ఛ’ కథనాన్ని ప్రచురించింది. హైడ్రా తీరును ప్రశ్నించింది. దీంతో హైడ్రా(Hydraa) అధికారులు ఎట్టకేలకు శ్రీ ఆదిత్య భవనాన్ని పరిశీలించారు.

‘స్వేచ్ఛ’లో కథనం


గండిపేట చెరువుకు దగ్గరలో మూసీ నదిపైన శ్రీ ఆదిత్య వాంటేజ్(Sri Aditya Vantage) పేరుతో 38 అంతస్తుల నిర్మాణం జరుగుతున్నది. 9 టవర్స్ పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే, ఈ మధ్య ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో గండిపేట చెరువు నుంచి నీటిని దిగువకు వదిలారు. ఆ వరదతో శ్రీ ఆదిత్య వాంటేజ్ భవనం మూసీలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణంపై ‘మూసీని మూసేస్తుంటే కళ్లు మూసేసుకున్నారా రంగ రంగా!?’ పేరుతో ‘స్వేచ్ఛ’ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త అధికార వర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read: DCC Appointments: డీసీసీ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు.. నేటి నుంచి జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు

‘స్వేచ్ఛ’ కథనంతో కదిలిన హైడ్రా

‘స్వేచ్ఛ’లో వచ్చిన కథనం వైరల్ కావడంతో శ్రీ ఆదిత్య భవనంపై ఎట్టకేలకు హైడ్రా ఫోకస్ పెట్టింది. మంగళవారం శ్రీ ఆదిత్య కన్‌స్ట్రక్షన్ వద్దకు చేరుకున్న హైడ్రా బృందాలు, మూసీలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిచిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇంజినీర్లపై వేటు

మరోవైపు, నగరంలో చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. వీటికి అధికారులు సైతం వత్తాసు పలుకుతుండడమే కారణం. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. చెరువుల బఫర్ జోన్‌లో ఎన్‌ఓసీలు ఇచ్చిన అధికారులపై వేటు వేసింది. 106 మంది నీటిపారుదల శాఖ ఇంజినీర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Venu Swamy puja: తాంత్రిక పూజలు చేస్తూ మరోసారి వైరల్ అయిన వేణు స్వామి .. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్