Harish Rao ( image credit: twitter)
Politics

Harish Rao: బనకచర్లను ఆపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? లేదా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: పాత డేట్ తో లేఖ విడుదల చేయడం తప్ప, ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)ను ఆపే ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? లేదా? అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు Banakacharla Project) పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్ లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాశాడన్నారు. ఇదే విషయాన్ని నేను ఈ నెల 11న తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి నిలదీశానన్నారు.

Also Read: Harish Rao: ఆరు గ్యారెంటీలు అమలవ్వాలంటే.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలి.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

ఎందుకు ఉత్తరం రాయలేదు?

అయినా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదని మండిపడ్డారు. అనుమతులు ఇవ్వొద్దు అంటూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ ప్రభుత్వం  లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఈ నెల 6న ఏపీ డీపీఆర్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాన్ని అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి గానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి గాని ఇప్పటివరకు ఎందుకు ఉత్తరం రాయలేదు? ఇదే విషయంలో తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ, ఎందుకు కేంద్ర జలశక్తి సెక్రటరీకి ఉత్తరం రాయడం లేదు? పాత డేట్ వేసి, ఈఎన్సీతో సీడబ్ల్యూసీకి ఉత్తరం రాస్తే ఏం లాభం? అని నిలదీశారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం

ఒకవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టు కట్టేందుకు వేగంగా ముందుకు కదులుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజలను బ్యాక్ డేటెడ్ లెటర్లతో మభ్యపెడుతున్నదన్నారు. గోదావరి నదీ జలాలను వరద జలాల పేరిట తరలించేందుకు తలపెట్టిన ఏపీ అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు.. డీపీఆర్ కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చిందన్నారు. బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాసే కుట్రలకు పాల్పడుతున్నదని ఎన్నిసార్లు ముల్లుకర్రతో పొడిచినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు.

Also Read: Harish Rao: దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా? హరీష్ రావు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?