Suryapet Police: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ (Suryapet Police) సిబ్బంది వారి ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని ఓ స్టేషన్లో సైతం మరో ఉద్యోగి ఇలాగే నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డుపై చక్కర్లు కొడుతున్నారు. ఇది కొన్ని నెలలుగా జరుగుతున్నా పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించకపోవడం కొసమెరుపు. మరికొందరు పోలీసు ఉద్యోగులు యూనిఫామ్ ధరించి హెల్మెట్ లేకుండానే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తున్నారు. వారిని చూసి మిగతా వాహనదారులు ముక్కున వేయలేసుకుంటున్నారు.
హెల్మెట్లు ధరించడం లేదని పోలీసులు చలాన్లు
ద్విచక్ర వాహనదారులకు నెంబర్ ప్లేట్లు లేవని, హెల్మెట్లు ధరించడం లేదని పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. ఓ రకంగా వీరు చేసే కార్యక్రమం మంచిదే. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో పాటు ప్రమాదాల నియంత్రణ అదుపు చేసేందుకు.. దొంగతనాల భారీ నుంచి తక్షణమే దొంగలను పట్టుకునేందుకు మంచి సత్ఫలితాలు ఇస్తోంది. సూర్యాపేట జిల్లాలోని వాహనదారులకు సూచనలు ఇస్తున్న పోలీస్ సిబ్బంది నిబంధనలకు పాతరేస్తున్నారు.
Also Read: Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ
జరిమానాలు విధిస్తుండడం
ఇక వాహనదారులు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవడానికి ఇదే చక్కటి ఉదాహరణ ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే చనిపోతున్నారని గణాంకాలు ఉండడంతో అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా పూనుకుంది. అందులో భాగంగానే ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తుండడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి జరిమానాలు విధిస్తుండడంతోపాటు మరోసారి నిబంధనలు ఉల్లంఘించకుండా ఉక్కుపాదం మోపుతోంది.
పోలీసులకు నిబంధనలు వర్తించవా?
అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్లు హెల్మెట్ ధరించి వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉండాలని పక్కాగా చెబుతున్న పోలీస్ ఆఫీసర్ లే వాటిని తుంగలో తొక్కడం.. యతెచ్చగా రోడ్లపై తిరుగుతుండడంతో పోలీసుల తీరుపై జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరే ఇలా వెళ్లినప్పుడు ఇక వారు ఎలా నిబంధనలు పాటిస్తారో సమాధానం చెప్పాలని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు సామాన్య వాహనదారులకే తప్ప పోలీసులకు కాదన్నట్లు వ్యవహరిస్తుండడంతో అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న వారిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
అనంతుల మధు.. తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే పోలీస్ సిబ్బందిలో కొంతమంది పోలీస్ లు నిబంధనలు పాటించడం లేదుపోలీసుల తీరు మారాలి. పోలీసులు ఇచ్చే సూచనలు ప్రజలకు ఎంతో విలువైనది. ప్రాణాలకు శ్రీరామరక్ష. కాని వారే హెల్మెట్ ధరించకపోవడం, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం ప్రజలకు రుచించదు. అలాంటి వారి వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Suryapet: పసిబిడ్డ కాళ్లు పట్టుకుని.. నేలకేసి కొట్టి చంపిన తండ్రి.. సూర్యపేటలో దారుణ ఘటన
