Anti Naxal Operation (imagecredit:swetcha)
తెలంగాణ

Anti Naxal Operation: మావోయిస్టుల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

Anti Naxal Operation: చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని తడ్పల ప్రాంతంలో కేజీహెచ్(KGH) పర్వత ప్రాంతంలో నక్సల్స్ దాచిపెట్టిన భారీ మొత్తంలో ఉన్న పేలుడు పదార్థాల(Explosives)ను కోబ్రా 206, సిఆర్పిఎఫ్ 229, 153, 196 నాతో పాటు బీజాపూర్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 51 లైవ్ బిజిఎల్ లు, 100 బండిల్స్ హెచ్డి అల్యూమినియం వైర్, 50 స్టీల్ పైపులు, 20 ఇనుప షీట్లు, పార్టీ ఇనుప ప్లేట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా నక్సల్స్ అమర్చిన ఐదు ప్రెషర్ ఐఈడి లను కూడా భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

గత కొంతకాలంగా చర్యలు నిర్వీర్యం

చతిస్గడ్ రాష్ట్రంలోని నక్సల్స్ కు సంబంధించిన పలు చర్యలను, ఐఈడి ప్రెషర్ బాంబు(IED pressure bomb)లను భద్రత బలగాలు నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రకటించిట్లుగానే 2000 మార్చి 31, 2026 వరకు నక్సల్స్ ను తుద ముట్టిస్తామని చెప్పినట్లుగానే భద్రతా దళాలను సైతం ఆ చర్యల దిశగా సాగుతున్నాయి. నక్సల్స్ వేసిన ఎత్తుగడలకు పై ఎత్తు వేస్తూ వారి చర్యలను ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు అరికడుతూ వస్తున్నాయి.

Also Read: Minister Vakiti Srihari: తెలంగాణ సాదనలో సోనియా గాంధీ మద్దతు కీలకం: మంత్రి వాకిటి శ్రీహరి

కాల్పుల విరమణకు లేఖలు

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే మావోయిస్టుల కథ ముగిసినట్లుగానే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగా చర్యలు చేపట్టేందుకు భద్రతాబలాలు మూకుమ్మడిగా మావోయిస్టులపై విరుచక పడుతున్నారు. ఎదురుకాల్పులకు పాల్పడిన వారిని ఎన్కౌంటర్లలో మట్టు పెడుతూ, లొంగిపోయేందుకు సుముఖంగా ఉన్న వారిని ఆయా ప్రభుత్వాల ద్వారా పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు. ఎదురుకాల్పులకు పాల్పడిన వారందరినీ భద్రతా బలగాలు మట్టు పెడుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు 42 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఇది చివరి ఘట్టంగానే..

మావోయిస్టులకు ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోవడంతో వివిధ చిన్న క్యాడర్లలో ఉన్న ఎక్కువమంది మావోయిస్టులు లొంగిపోయేందుకు ముగ్గు చూపుతున్నారు. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకుల్లో విభేదాలు కనిపించి ఓ వర్గం మావోయిస్టులు కాల్పుల విరమణకు మొక్కుచూపుతుండగా మరికొంతమంది విభేదిస్తూ వస్తున్నారు. ఏదేమి అయినప్పటికీ మావోయిస్టులకు ఇది చివరి ఘట్టంగానే కేంద్ర ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ప్రభుత్వం అనుకున్నట్లుగానే మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేయడమే ధ్యేయంగా కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర(Chhattisgarh State) ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి. అయితే లొంగిపోవడమా…? లేదంటే ఎన్కౌంటర్లలో మృతి చెందడమా..? అనేది మావోయిస్టు అగ్ర నేతలు తేల్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

Also Read; Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్