Suryapeta-SP
నల్గొండ, లేటెస్ట్ న్యూస్

Phones Recovery: 100కు పైగా ఫోన్ల రికవరీ… సూర్యాపేట ఎస్పీ కీలక ప్రకటన

Phones Recovery: ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్..

ఈ సంవత్సరం 842 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించాం
వీటి విలువ రూ.7 కోట్ల 15 లక్షలు ఉంటుంది
మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడి

సూర్యాపేట, స్వేచ్ఛ: సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్‌ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు (Phones Recovery) చేశారు. జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 102 ఫోన్లను గుర్తించి, రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందించారు. ఎస్పీ మాట్లాడుతూ, ఈ సంవత్సరం 6వ దఫా మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు.  సుమారుగా రూ.7.15 కోట్ల విలువైన 842 మొబైల్‌లను రికవరీ చేసి బాధితులకు అందించామని తెలిపారు. సోమవారం 102 మొబైల్స్ బాధితులకు అందించామంటే, దీని వెనుక జిల్లా పోలీసుల కృషి చాలా ఉందన్నారు. పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 102 మొబైల్ బాధితులు అందుకున్నారని చెప్పారు. వీటిని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని, ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనదని, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్‌లైన్ విద్య కోసం వినియోగిస్తున్నామన్నారు.

మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది.మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు.సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్ సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని, పోలీసు ప్రజల ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, మన కోసం పోలీసు ఉన్నారని భావన కలిగి వారి కృషిని గుర్తించాలి అని అన్నారు,ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి,మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని చెప్పారు.

Read Also- DK Aruna: ప్రధాన మంత్రి ధన్‌ ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరం.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

అత్యాశకు పోవద్దు.. అసలు పోగొట్టుకోవద్దు

ప్రస్తుత సమాజంలో చాలా సందర్భాలలో అధిక వడ్డీలు ఇస్తామంటూ చెప్పి ప్రజలను మోసం చేసిన సందర్భాలు చూస్తున్నామని, ప్రజలు అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడొద్దని ఎస్పీ సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని సీబీఐ, సీఐడీ లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దం అన్నారు.

ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్

‘‘పోలీసు మీ కోసం ఉన్నారు, ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాం. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణాపై పోలీసుకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమాలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతిఒక్కరూ  యూనిఫాం లేని పోలీసు. వీటిపై మాకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూలన వారియర్స్ లాగా ఉండాలి. వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలీసులతో భాగస్వామ్యం అయినట్లే, సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలి’’ అని సూచించారు.

Read Also- Telusu Kada Trailer: ఇద్దరు భామలతో స్టార్ బాయ్ రొమాన్స్.. ట్రైలర్ ఎలా ఉందంటే..

ధన్యవాదాలు తెలిపిన బాధితులు

పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి, అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సీఈఐఆర్అ ప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐ‌టీ కోర్ సిబ్బంది, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!