Minister Adluri Lakshman (imagecredit:twitter)
తెలంగాణ

Minister Adluri Lakshman: గుడ్ న్యూస్.. 4092 గురుకుల ఉద్యోగుల సేవలు పునరుద్ధరణ

Minister Adluri Lakshman: గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల్లోని 4092 మంది ఉద్యోగుల సేవలను పునరుద్ధరించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్​(Minister Adluri Lakshman) తెలిపారు. గురుకుల విద్యా వ్యవస్థపై తమ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు. ఉద్యోగుల సేవలను గుర్తించి వారికీ న్యాయం చేయాలనే మానవతా దృక్పథం ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్‌(Contract) పద్ధతిలో 2, అవుట్‌సోర్సింగ్‌(Out Sorcing) పద్ధతిలో 1,545, పార్ట్‌టైమ్‌ విధానంలో 2,102, హానరేరియం పద్ధతిలో 443 మంది ఉద్యోగుల సేవలు పునరుద్ధరించామని పేర్కొన్నారు.

Also Read: Mysterious Temples: శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని అత్యంత రహస్యమైన దేవాలయాలున్నాయని తెలుసా?

ఇకపై ప్రతినెలా వేతనాలు..

గత కొన్ని నెలలుగా కంటిన్యూషన్‌ ఆర్డర్లు లేకపోవడంతో వేతనాల చెల్లింపులో సాంకేతిక ఆటంకాలు తలెత్తి, అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి గుర్తుచేశారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సేవాభావాన్ని గుర్తించి, వారి సేవలను కొనసాగిస్తూ జీవో 1533 జారీ చేయడం ద్వారా మానవతా దృక్పథాన్ని చూపిందని తెలిపారు.

ఇకపై ప్రతినెలా వేతనాలు సకాలంలో చెల్లింపునకు మార్గం సుగమం అవుతుందని, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సేవలను కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వలన వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమాజ అభ్యున్నతికి అంకితభావంతో పని చేస్తున్నారన్నారు.

Also Read: Fraud in Nalgonda: స్టాక్ మార్కెట్లో రూ. 12 కోట్లు పెట్టి… జనాల్ని నిలువునా ముంచేశాడు.. ఆ తర్వాత..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!