Fraud in Nalgonda:
నల్లగొండ స్వేచ్ఛ: నిండా 25 సంవత్సరాలు లేని ఓ యువకుడు నల్లగొండ జిల్లాలో (Fraud in Nalgonda) కొంతమంది నుంచి అధిక వడ్డీ ఆశచూపి పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నారు. ఏకంగా .12 కోట్లు స్టాక్ మార్కెట్లో పెట్టాడు. సరైన అవగాహన లేకపోవడంతో స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు అన్ని ఢమాల్ అయిపోయాయి. దీంతో బాధితులకు టోకరా పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు నల్లగొండలోని అతని ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బాధితులను కట్టడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీశారు. కాగా, నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన బాలాజీ నాయక్ డిగ్రీ చదివి ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఐస్ క్రీం షాపు నిర్వహించి అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధికంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈ ఆలోచనతో బాలాజీ నాయక్ తన కమ్యూనిటీకి చెందిన కొంతమంది వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. సరైన అవగాహన రాహిత్యం లేని బాలాజీ నాయక్ స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు అన్ని నష్టపోయాడు.
అధిక వడ్డీ ఆశతో రూ.12 కోట్లు దగా
నల్లగొండ జిల్లా ఓ మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ నాయక్ నల్లగొండలో ఐస్ క్రీమ్ షాపు నిర్వహించి రూ.15 లక్షలు అప్పు చేశాడు. అదే అప్పు తీర్చేందుకు ఆ తర్వాత ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ వారి వద్ద నుంచి అధిక వడ్డీలకు 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత వడ్డీకి తీసుకున్న డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు మద్యం షాపుల్లో కూడా రూ.2 కోట్లతో 11 మద్యం షాపులకు టెండర్ దాఖలు చేశారు. అక్కడ కూడా బాలాజీ నాయక్ అదృష్టం ఫలించలేదు. 111 షాపులకు టెండర్లు దాఖలు చేస్తే ఒక్క షాపు మాత్రమే ఆయనకు వచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడం, 111 మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేస్తే ఒక్క షాపే రావడంతో అప్పుల్లో కూరుకు పోయాడు.
Read Also- Illegal Sand Transport: రోడ్డు బ్లాక్ అయ్యేలా ఇసుక లారీలు.. ఇంత జరుగుతున్నా పట్టించుకోరేం?
మరికొంతమంది వద్ద రూ.20 వడ్డీతో
స్టాక్ మార్కెట్లో రూ.12 కోట్లు, మద్యం షాపుల టెండర్లకు రూ.2 కోట్లు ఖర్చు చేసిన బాలాజీ నాయక్ ఇంకొంచెం సాహసం చేసి అత్యంత సమీప వ్యక్తుల నుంచి రూ. 20 ఆఫర్ చేసి వడ్డీకి మరికొంత డబ్బును సేకరించాడు. అవే డబ్బులతో మొదటి నుంచి తీసుకువచ్చిన డబ్బులకు అధిక వడ్డీలు రెగ్యులర్ చెల్లిస్తూ వస్తున్నాడు. గత నాలుగు రోజుల క్రితం బాలాజీ నాయక్ అధిక వడ్డీలు చెల్లించలేక ఏం చేయాలో తోచక కోర్టు ద్వారా ఐపీ పెట్టేందుకు ప్రయత్నాలు సాగించాడు. విషయం తెలుసుకున్న బాలాజీ నాయక్ కమ్యూనిటీకి చెందినవారు ఆయన ఇంటిపై ముకుమ్మడిగా దాడి చేసి అలజడి సృష్టించారు. ఏకంగా ఇంట్లో ఉన్న సామాగ్రినంత ధ్వంసం చేసి ఇంటికే నిప్పంటించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు బాలాజీ నాయక్ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై విచారణ చేశారు.
రూ. 6 నుంచి రూ. 10 కోట్లు ఉన్నట్లు పోలీసుల గుర్తింపు
నల్లగొండ జిల్లాలో బాలాజీ నాయక్ తన కమ్యూనిటీకే చెందిన కొంతమంది వద్ద నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి వివిధ ప్లాట్ఫాములపై పెట్టుబడులు పెట్టాడు. నెలవారీగా చెల్లించాల్సిన డబ్బులను సరిగానే చెల్లించిన బాలాజీ నాయక్ ఇక అధిక వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలో కోర్టు ద్వారా ఐపీ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో విషయం గమనించిన వడ్డీకి ఇచ్చిన బాధితులంతా ఉప్పెనల ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. ఈ విషయం విలువలోకి రావడంతో పోలీసులు బాలాజీ నాయక్ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. రూ. 6 నుంచి రూ. 10 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులందరికీ సమన్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also- Love Betrayal: ప్రేమ పేరుతో ప్రియుడి వంచన… ప్రేయసి ఏం చేసిందంటే
డబ్బులు ఇస్తే తిరిగి ఇచ్చే కెపాసిటీ ఉంటేనే ఇవ్వాలి
డబ్బులు ఇస్తే తిరిగి ఇచ్చే కెపాసిటీ ఉన్న వారికే డబ్బులు ఇవ్వాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ బాధితులకు సూచనలు చేశారు. వడ్డీ వ్యాపారం చేసేందుకు రిజిస్ట్రేషన్ ఉన్నదా?, లేదా? అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత డబ్బులు వడ్డీలకు ఇచ్చే వారిదేనని గుర్తు చేశారు. దాదాపు బాలాజీ నాయక్ రూ.5 నుంచి మొదలుపెడితే రూ. 20 వరకు అధిక వడ్డీల బాధితులకు ఆశ చూపించి పెట్టుబడులు తీసుకున్నాడు. రూ.10, రూ.20 అంటే దాదాపు 120 శాతం నుంచి 240 శాతం వరకు వడ్డీ ఇస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి ఆగం కావద్దని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. నిందితుడిపై మనీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నట్లుగా వివరించారు. బాధితులు అందరికీ బాలాజీ నాయక్ వద్ద ఉన్న డబ్బులను అడ్జస్ట్మెంట్ చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
