Minister Sridhar Babu (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Sridhar Babu: రెండు మూడు నెలల్లో ‘ఏఐ’ సిటీకి భూమి పూజ: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: ఈ ఏడాది సెప్టెంబర్ లో రూ.4804 కోట్ల విలువైన 6612 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇది గతేడాది కంటే 35 శాతం అధికం.. విలువలో వార్షిక వృద్ధి 70 శాతంగా నమోదైంది.. ఇవి కేవలం గణాంకాలు కాదు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలయ్యిందంటూ మాపై దుష్ప్రాచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానాలని’ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలెప్ మెంట్ కౌన్సిల్(National Real Estate Development Council)(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహిస్తున్న ‘15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘2024-25లో రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, 11.97 శాతం వృద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చిందన్నారు. స్టేట్ సర్వీసెస్ జీఎస్ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉందన్నారు. హైదరాబాద్(Hyderabada), రంగారెడ్డి(Ranagareddy), మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్ లో రూ.2820 కోట్ల విలువైన 4903 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. ‘ఈ సెప్టెంబర్ లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం పెరుగుదల ఉందని, మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతం అన్నారు.

మూడు నెలల్లోనే భూమి పూజ..

భారత్ లో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్(Real estate) రంగంలోనే ఉపాధి పొందుతున్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీ(GDP)లో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 శాతం 15 శాతం కాగా, చైనాలో అత్యధికంగా 23 శాతం నుంచి 25 శాతం వరకుందన్నారు. దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే అని, ఇది మరింత పెరగాల్సిన అవసరముందన్నారు. ‘ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో ఫేజ్ 2, భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్(RRR)డు తదితర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ(Telangana) రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. డిసెంబర్ నాటికి ‘ఫ్యూచర్ సిటీ’లో జోనలైజేషన్ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీ(AI City)కి రెండు, మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి, కాళీ ప్రసాద్, కిరణ్, కె.శ్రీధర్ రెడ్డి, ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Also Read; advance release date strategy: కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ముందే ఎందుకు ఫిక్స్ చేస్తున్నారు?.. ఫ్యాన్స్ కోసమేనా?

రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్..

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో “రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్” అనే థీమ్‌తో నిర్వహించిన “గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ఎనిమిదో ఎడిషన్” ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు కాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన సామాజిక బాధ్యత మనందరి పై ఉందన్నారు. “ఆరోగ్య తెలంగాణ” ను నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ శివసేనారెడ్డి, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. చినబాబు సుంకవల్లి తదితరులు పాల్గొన్నారు.

Also Read: TG Liquor License: వైన్స్ షాపుల అప్లికేషన్ కౌంటర్ తనిఖీ చేసిన కమిషనర్ హరికిరణ్

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..