TG Liquor License (imagecredit:swetcha)
తెలంగాణ

TG Liquor License: వైన్స్ షాపుల అప్లికేషన్ కౌంటర్ తనిఖీ చేసిన కమిషనర్ హరికిరణ్

TG Liquor License: వైన్ షాపుల లైసెన్స్​కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ఆశావహులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్(Excise Commissioner Harikiran) అధికారులను ఆదేశించారు. దరఖాస్తు ఇవ్వగానే రిసిప్ట్‌తో పాటు, వేలంపాటలో పాల్గొనేందుకు వీలుగా వెంటనే ఎంట్రీ పాస్‌(Entry Pass) కూడా జారీ చేయాలన్నారు. నాంపల్లి(Nampally)లోని ఆబ్కారీ భవన్‌లో ఉమ్మడి పది జిల్లాల వైన్ షాపు దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆయన పరిశీలించారు.

పెద్ద సంఖ్యలో ఆశావహులు..

దరఖాస్తుల స్వీకరణ, రసీదులు జారీ చేయటం, ఎంట్రీ పాస్‌లు ఇవ్వటంపై ఆయా కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు చేసుకోవటానికి చివరి వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఆశావహులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కౌంటర్ల వద్ద రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కమిషనర్ స్వయంగా ఆబ్కారీ భవన్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు.

Also Read: South Central Railway: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. రైళ్ల టైమింగ్స్ మారాయ్.. నేరుగా వెళ్లారో బుక్కైపోతారు!

సిబ్బందికి శిక్షణ..

ఆయా కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బందితో మాట్లాడిన అనంతరం దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా, త్వరితగతిన దరఖాస్తులు తీసుకోవటం, రిసిప్టులు, ఎంట్రీ పాస్‌లు ఇవ్వటంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఆబ్కారీ భవన్ మొదటి అంతస్తులో ఉమ్మడి ఆదిలాబాద్‌(Adhilabadh), హైదరాబాద్(Hyderabad), కరీంనగర్(karimnagar), ఖమ్మం(Khammam), మహబూబ్‌నగర్(Mahabubnagar), మెదక్(Medak), నల్గొండ(Nalgonda), వరంగల్(Warangal) జిల్లాలకు సంబంధించిన కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో నిజామాబాద్(Nizamabad), రంగారెడ్డి(rangareddy) జిల్లాలకు సంబంధించిన కౌంటర్లను పెట్టారు.

Also Read: Jr NTR: బావమరిది వివాహంలో ఎన్టీఆర్ సందడి.. పిక్స్ వైరల్..

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..