Viral Parenting Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఒక తండ్రి, తన టీనేజ్ డాటర్స్ కి “ఫ్యాషన్ లెసన్స్ ” ఇవ్వడానికి.. ఏకంగా అమ్మాయి లాగా రెడీ అయ్యాడు. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, పేరెంటింగ్‌లో ఒక సూపర్ స్మార్ట్ ఇడియా కూడా. ఇప్పుడు 2025లో, చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళ లాగా డ్రస్సింగ్ వేయడం, మేకప్ లు వేసుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. ఈ అలవాటును తప్పించకపోతే పెద్దయ్యే సరికి తల్లి దండ్రుల మాట కూడా లెక్కచెయ్యరు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ తండ్రి, తన ముగ్గురు ఆడ పిల్లల కోసం, అమ్మాయిగా తయారయ్యి మరి ఏ విధంగా నడవాలి? ఎలా కూర్చోవాలి? ఎలా నవ్వాలి ? అనే విషయాలను దగ్గరుండి నేర్పిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్య విషయాలు
1. విలువలు & నీతి (Values & Ethics)
నీతి, నిజాయితీ, గౌరవం.. ఇవి పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైనవి. పిల్లలు వారి తప్పును వారే గుర్తించి, ఇతరుల పట్ల గౌరవంగా ఉండాలని నేర్పించాలి.
2. స్వావలంబన (Self-Reliance)
పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను వారే సాల్వ్ చేయడం, బాధ్యత తీసుకోవడం లాంటివి నేర్పించాలి. ఉదాహరణకు, హోమ్‌వర్క్ అయిపోయిన తర్వాత చిన్న టాస్క్‌లు చేపించాలి (రూమ్ క్లీన్ చేయడం, బట్టలు తీయడం)
3. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (Emotional Intelligence)
ఫీలింగ్స్‌ను గుర్తించడం, వాటిని ఎక్స్‌ప్రెస్ చేయడం, ఒత్తిడిగా ఉన్నప్పుడు అప్పుడు వారిని వారు హ్యాండిల్ చేయడం.
ఉదాహరణకు, ” నీవు కోపంగా ఉన్నావా? అయితే మాట్లాడు ” అంటూ వారిని దగ్గరకు తీసుకుని, అలాంటి సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలో నేర్పించాలి.
4. రెస్పెక్ట్ & సోషల్ స్కిల్స్
ఇతరుల సంస్కృతి, ఆలోచనలు, డిఫరెన్సెస్‌ను గౌరవించడం నేర్పించాలి. సోషల్ మీడియా యుగంలో, ఆన్‌లైన్ ఎలా ఉపయోగించాలో? ఎలా ఉపయోగించకూడదో కూడా నేర్పించండి. ఎవరి మీద ట్రోల్స్ చేయకూడదని చెప్పండి.
