Minister Sridhar Babu (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Sridhar Babu: వరంగల్ నల్గొండ జిల్లాలో ఇంక్యూబేషన్ సెంటర్.. టీ హబ్ తరహాలో ఏర్పాటు!

Minister Sridhar Babu: తెలంగాణను ‘ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్(Warangal), నల్గొండ(Nalgonda)లోనూ టీ-హబ్(T-HUB) తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్(Minister Duddilla Sridhar) బాబు వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్‌కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ సమాజహితానికి బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ(Telangana)ను గ్లోబల్ ఫార్మా(Global Pharma,), లైఫ్ సైన్సెస్(Life Sciences) హబ్‌గా మాత్రమే కాకుండా ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గానూ మార్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమన్నారు. రీసెర్చ్‌ను మార్కెట్‌కు, పాలసీని రోగికి అనుసంధానించే సమగ్రమైన 360 డిగ్రీల ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా రూ.54వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఎలీ లిల్లీ లాంటి అంతర్జాతీయ ఫార్మా దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకొచ్చి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: గురుకులాల సమస్యలపై సీఎం ఫోకస్.. తక్షణమే రూ.60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

యువ ఇన్నోవేటర్స్‌కు..

డాక్టర్ల కంటే వేగంగా రోగాలను నిర్థారించినా, అనుభూతి చెందే మనసును మాత్రం ఏ యంత్రం భర్తీ చేయలేదన్నారు. దేశంలో తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్ మెంట్’గా పెట్టేందుకు ముందుకు రావాలని ప్రవాసీ భారతీయ నిపుణులకు విజ్ఞప్తి చేశారు. పేటెంట్లను కాకుండా మీ ఆవిష్కరణ వల్ల ఎంత మందికి మేలు జరిగిందన్నదే చరిత్ర గుర్తుంచుకుంటుందని యువ ఇన్నోవేటర్స్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Min Komati Reddy Venkat Reddy), కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి(Prathap Reddy), డా. ప్రభాశంకర్, రాంప్రసాద్ రెడ్డి, ప్రద్యుమ్న, డా. విజయ్ కుమార్, ప్రొఫెసర్ భాస్కర్ ఆర్. జాస్తి, రాజేశ్వర్ తోట, ప్రొఫెసర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Also Read: 120 marks for 100: ఇదేందయ్యా ఇదీ.. 100కి 120 మార్కులు ఇచ్చిపడేసిన యూనివర్సిటీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!