CM Revanth Reddy: గురుకుల పాఠశాలలు కళాశాలల ఇబ్బందులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టి సాలించారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలు, కళాశాలల్లో వంట చేసే కాంట్రాక్టర్లు, కిరాణం, మటన్, చికెన్, కూరగాయలు, పండ్లు సప్లై చేసే కాంట్రాక్టర్లు వారికి ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్ ఉండడం, పెరిగిన మెనూ ప్రకారం చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు ఆరు రోజులుగా స్ట్రైక్ చేస్తున్న నేపథ్యంలో గురుకులాల్లో వంట.. తంటా.. శీర్షికన స్వేచ్ఛ డైలీ లో శుక్రవారం వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతి బా పూలే, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్ వేల్పేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్(Emergency fund) విడుదల చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించే దాకా..
ఒక్కో ఎస్సీ(SC), బీసీ(BC) సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల పాఠశాల కళాశాలల్లో వంట తంటా గా మారాయి. అయితే పెండింగ్ బిల్లులు చెల్లించే దాకా వంట చేసేది లేదని కాంట్రాక్టర్లు ఐదు రోజులుగా స్ట్రైక్ చేశారు. పండగ సెలవులు తర్వాత గురుకులాలకు చేరిన విద్యార్థులకు వంట చేసి పెట్టలేక ఉపాధ్యాయులు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట చేసే పరిస్థితి లేకపోవడంతో వంట సమస్య తెగేదాకా గురుకులాకు రావద్దని విద్యార్థులకు ప్రిన్సిపాల్ తెగేసి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఈనెల 3న దసరా సెలవులు ముగిసిన ఇప్పటికీ గురుకుల పాఠశాలలోకి విద్యార్థులు పూర్తిస్థాయిలో చేరుకోలేదు.
Also Read: CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు
60 కోట్ల రూపాయలను రీలీజ్..
వచ్చిన విద్యార్థులకు కూడా వంట కాంట్రాక్టర్ల స్ట్రైక్ చేయడంతో విద్యార్ధులకు భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. 5 రోజులుగా వంట కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో వంట తయారి ఇబ్బందికరంగా మారింది. దీంతో వెంటనే స్సందించిన సీఎం ఎమర్జెన్సీ ఫండింగ్ కింద ప్రభేత్వం 60 కోట్ల రూపాయలను రీలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1000కి పైగా ఉన్న మహాత్మా జ్యోతి బా, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వేల్పేర్, మైనారిటీ గురుకుల పాఠశాలు, కళాశాలల్లో వంట చేసే, కూరగాయలు, కిరాణం సామాగ్రి, మటన్, చికెన్, పండ్లు సప్లై చేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా బిల్లులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారిందని, అప్పుల పాలు అవుతున్నాం. కనీసం వంట చేసే కార్మికులకు వేతనాలునిచ్చే పరిస్థితి లేకపోవడంతో వెంటనే తమకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రబుత్వం స్పందించింది.
