R Krishnaiah (imagecredit:twitter)
తెలంగాణ

R Krishnaiah: ఈనెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య

R Krishnaiah: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు(High Cort) స్టే ఇవ్వడంపై ఆ సామాజికవర్గం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 14న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. కాగా ఈ బంద్ కు బీజే(BJP)పీ మద్దతు తెలపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah.).. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ని కోరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డిని కలిసిన కృష్ణయ్య బందర్ కు మద్దతివ్వాలని కోరారు. కాగా బంద్ పై పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారని కృష్ణయ్య వెల్లడించారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో..

ఆపై కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 14న 22 బీసీ(BC) సంఘాల మద్దతుతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవో(GO)పై హై కోర్టు స్టే ఇవ్వడం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ ఈ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడమేంటని కృష్ణయ్య ప్రశ్నించారు.

Also Read: Moles: పుట్టుమచ్చల వలన క్యాన్సర్ వస్తుందా ? దీనిలో నిజమెంత?

నామినేషన్లు వేశాక..

బీసీ సంఘాలు ఇప్పటికే పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నాయని గుర్తుచేశారు. నామినేషన్లు వేశాక కోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదని ఆయన విమర్శళు చేశారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీ(BC)ల ఉద్యమం ఉండబోతోందని సర్కార్ ను హెచ్చరించారు. కోర్టు తీర్పు బీసీ(BC)ల కు నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కునట్టు ఉందని పేర్కొన్నారు. ఆర్గ్యుమెంట్స్ వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేశారు.

Also Read: Tourist police: తెలంగాణలో అందుబాటులోకి పర్యాటక పోలీసులు.. ఎంతమందంటే?

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్