- పేరు మార్చినా తీరు మార్చుకోని కొందరు టీజీపీఎస్సీ సిబ్బంది
- ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ అడుగులు
- గ్రూప్ పరీక్షల లీకేజీలతో అప్రతిష్టపాలైప బీఆర్ఎస్
- బీఆర్ఎస్ సర్కార్ తో లబ్ది పొందిన కొందరు టీజీపీఎస్సీ సిబ్బంది
- ఇప్పటికీ బీఆర్ఎస్ కీలక నేతలతో రెగ్యులర్ గా ఫోన్లలో టచ్
- నిఘా కెమెరాలను పట్టించుకోని కొందరు సీనియర్ సిబ్బంది
- సీఎం దృష్టికి వెళ్లిన సీనియర్ సిబ్బంది వ్యవహారం
- శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్
TSPSC department suspected officers regularly touch with BRS leaders :
తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ను సమూల ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో గ్రూప్-1 ఇతర పరీక్ష పేపర్ల లీకేజీలతో అప్రతిష్టపాలైన టీజీపీఎస్సీలో కొందరు ఉన్నతాధికారులు ఇప్పటికీ కమిషన్ లకు కక్కుర్తిపడి పబ్లిక్ గా బీఆర్ఎస్ కు లీకేజీలందిస్తూ వారి సర్వీసులో తరిస్తున్నారు. టీజీపీఎస్సీకు సంబంధించిన కీలక విషయాలు బీఆర్ఎస్ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలతో ఇక్కడి కొందరు ఉద్యోగులు రెగ్యులర్ గా బీఆర్ఎస్ నేతలతో ఫోన్లలో టచ్ లో ఉన్నట్లు సమాచారం.
టీజీపీఎస్సీ సమూల ప్రక్షాళన
ఒక పక్క తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ )ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. . ఇందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ రాష్ట్రానికి వెళ్లి, అక్కడి విధానాన్ని పరిశీలించి వచ్చారు. మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ విధానాన్నీ పరిశీలించి వచ్చారు. అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా టీజీపీఎస్సీలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామకాల క్యాలెండర్‌ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ తో ఈ ప్రక్రియ పెండింగ్ లో ఉండిపోయింది.
బీఆర్ఎస్ నేతలతో ఫోన్ టచ్
టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బందికి ఈ మధ్య తరచుగా బీఆర్ఎస్ నేతల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సంబంధిత కార్యాలయం సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అలా వచ్చిన ఫోన్లను కార్యాలయంలో ఏదో ఒక మూలకు వెళ్లి వాళ్లతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సిబ్బందిలో కొందరు కాసులు, కమిషన్లకు కక్కుర్తి పడి డిపార్ట్ మెంట్ లో కీలక ఫైళ్ల సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీకి లీకులు అందిస్తున్నారని టీజీపీఎస్సీ సిబ్బంది బాహాటంగానే చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1తో పాటు పలు పోటీ పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పెను దుమారం రేపిన పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు. అయితే కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బందిపై నిఘా పెంచారు. పై స్థాయి అదికారులకు తప్ప చిన్న ఉద్యోగులంతా తమ ఫోన్లను బయటే పెట్టి పనిచేసుకోవాల్సి ఉంటుంది. అయినా వాళ్లలో కొందరు ప్రత్యామ్నాయంగా రహస్యంగా రెండో ఫోన్ ద్వారా పలువురితో కాంటాక్ట్ లో ఉన్నట్లు సమాచారం. పై స్థాయి అధికారులకు వీరిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా త్వరలోనే అనుమానాస్పద సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. త్వరలో మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కమిషన్‌లో పనిచేస్తున్న కొంత మంది కీలక అధికారులు గులాబీ పార్టీ నేతలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్‌కు చెందిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
సీఎం సీరియస్
టీజీపీఎస్సీలో కొందరు సిబ్బంది గులాబీ పార్టీ లీడర్లతో టచ్ లో ఉంటున్నారనే విషయం సీఎం రేవంత్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీెం సదరు అధికారుల పనితీరు, కదలికలపై ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పాత సిబ్బందిని శాఖలు మార్చడమో లేక వేరే చోట్లకు బదిలీ చేయడమో అనేదానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నిఘా వర్గాలను అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది.