Jubilee Hills Survey: బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ 2.80 శాతం అధికం?
Jubilee Hills Survey (IMAGE CREDIT: TWITTER)
Political News, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీతో పోల్చితే కాంగ్రెస్ 2.80 శాతం అధికం?.. ప్రభుత్వానికి చేరిన రిపోర్ట్!

Jubilee Hills Survey: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీతో పోల్చితే సుమారు 2.80 శాతం అత్యధికంగా ఉన్నట్లు సర్వేల్లో (Jubilee Hills Survey) తేలింది. తాజాగా ప్రభుత్వానికి మూడో సర్వే రిపోర్టు చేరింది. ఇందులో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పరిశీలించగా, హస్తం లీడ్ లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ సీటు పక్కా అని ప్రభుత్వం ధీమాతో ఉన్నది. గతంలో అభ్యర్ధి ఎంపిక, పార్టీ పరిస్థితులపై సర్వేలు నిర్వహించిన పార్టీ గెలుపు అంచనాలను కూడా మూడో సర్వేలో అధ్యయనం చేసింది. హస్తం పార్టీ కి వచ్చిన పాజిటివ్ లీడ్ పోలింగ్ నాటికి మరింత పెరగాలని సీఎం రేవంత్ రెడ్డి ఇన్ చార్జ్ మంత్రులకు సూచించారు. పీసీసీ చీఫ్​ కూ ఆదేశాలిచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకునేందుకు పార్టీ తన వ్యూహాలను అమలు చేస్తున్నది.

Also  Read: Ponguleti Srinivasa Reddy: ‘మాది గేదెలాంటి ప్రభుత్వం’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటిలిజెన్స్ సర్వేలో 8 శాతం..?

ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటిలిజెన్స్ సర్వేల్లోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినట్లు సమాచారం. బీఆర్ ఎస్ పార్టీతో పోల్చితే 8 శాతం హస్తం లీడ్ లో ఉన్నట్లు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. పార్టీ, ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రోఫెషనల్స్ నిర్వహించిన సర్వేల్లో దాదాపు మూడు శాతం అత్యధికంగా హస్తం ప్రదర్శించగా, ఇంటిలిజెన్స్ సర్వేలో దాదాపు 8 శాతం చూపించారు. రెండు సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీ లీడ్ కు రావడంతో గెలుపు ఖాయమని హస్తం లీడర్లు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇక క్యాండియేట్ కూడా స్థానికుడు కావడంతో పాటు, ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి వంటి అంశాలన్నీ విజయం దిశగా అడుగుల వేపిస్తాయని పార్టీ నేతలు నమ్ముతున్నారు.

డెవలప్ మెంట్ పై భరోసా..?

సుమారు 3 లక్షలకు పైగా ఓటర్లు కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హస్తం గెలపు దిశగా అడుగులు వేస్తోన్నది. పోలింగ్ నాటికి మరింత స్కోర్ సొంతం చేసేందుకు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్లాన్ లను అమలుచేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏకంగా దాదాపు రూ. 200 కోట్లతో శంకు స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. యువత ఉద్యోగాలకు హామీ ఇస్తూ సర్కార్ ముందుకు సాగుతుంది. స్కిల్ డెవలప్ మెంట్ కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నది. ఇక కులాల వారీగా కమ్యూనికేషన్ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు మంత్రులు, ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో శ్రమిస్తున్నారు. డివిజన్ లు వారీగా ఇన్ చార్జీలను నియమించి, పార్టీ గ్రాఫ్​ ను పెంచేందుకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పబ్లిసిటీ చేయనున్నారు.

Also Read: Hyderabad Drug Bust: హైదరాబాద్‌లో డ్రగ్స్​ ముఠా గుట్టు రట్టు.. రూ. కోటి విలువైన డ్రగ్స్‌ స్వాధీనం!

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!