Fitness ( Image Source: Twitter )
Viral, లైఫ్‌స్టైల్

Fitness Secrets: 50 ఏళ్ల వయస్సులో కూడా అందంగా కనిపించాలంటే.. ఎలాంటి డ్రింక్ తీసుకోవాలో తెలుసా?

Fitness Secrets: ఫిట్‌నెస్ ఐకాన్‌గా, స్టైల్ సెన్సేషన్‌గా బాలీవుడ్ బ్యూటీ స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లు దాటినా, ఈ హాట్ భామలు ఫిట్‌నెస్, గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు. తమ ఆకర్షణీయమైన అందం, సన్నని శరీరంతో యువతను నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే, ఈ ముద్దుగుమ్మల ఫిట్‌నెస్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఎంతోమందికి ఉంటుంది. వాళ్ళు ఏం ఫాలో అవుతారో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మందికి ఉదయం ఒక కప్పు టీ లేదా కాఫీ లేకుండా రోజు గడవదు. అది శరీరానికి చురుకుదనం ఇస్తుందని, నిద్రమత్తు తొలగిపోతుందని వారు నమ్ముతారు. కానీ, ఈ బాలీవుడ్ భామలు మాత్రం ఈ రెండింటికీ పూర్తిగా దూరం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆహారపు అలవాట్ల గురించి హీరోయిన్స్ మాట్లాడుతూ, “ మేము టీ, కాఫీ అస్సలు తాగము. అందుకే ఉదయం వాటిని తాగాల్సిన అవసరం కూడా మాకు లేదు,” అని స్పష్టంగా చెప్పారు. చిన్నప్పటి నుంచి పాలు ఇష్టంగా తాగేవాళ్లం, కానీ ఇప్పుడు శరీరాన్ని తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి  బటర్ మిల్క్ , కొబ్బరి నీళ్ళు వంటి సహజమైన పానీయాలను ఎంచుకుంటున్నామని తెలిపారు.

వారిలో మలైకా తన అనుభవాన్ని పంచుకుంటూ, “ఒకసారి కాఫీని ప్రయత్నించాను, కానీ దాని రుచి నాకు నచ్చలేదు. అంతేకాదు, దాన్ని తాగిన తర్వాత నా కడుపులో కూడా అసౌకర్యంగా అనిపించింది. కాఫీ వాసన నాకు ఇష్టమే, కానీ దాన్ని తాగడం నా వల్ల కాదు,” అని మలైకా చెప్పింది. టీ, కాఫీలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే ఉత్తేజకర పానీయాలు. టీలో టానిన్లు, కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి మెదడును, శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రెండింటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వీటిని అతిగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సమస్యలు వంటి సమస్యలు రావచ్చు. మలైకా సొంత మాటల్లో చెప్పినట్లు, పానీయాల విషయంలో ప్రతి ఒక్కరికీ వారి వారి ఇష్టాలు, అవసరాలు ఉంటాయి. మన శరీరానికి ఏది సరిపోతుందో గుర్తించి, దాన్ని మాత్రమే తీసుకోవాలి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!