MP Laxman: రాజ్యాంగం ప్రకారం చేపట్టాల్సిన బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్(Congress) అపహాస్యం చేసిందని, కులాలవారీగా కుట్రలు పెంచి కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxmana) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ఎన్డీయే(NDA)కు గండి కొట్టాలనే పన్నాగంలో భాగంగానే ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలుచేయలేదో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కులగణన వివరాలు..
రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందా? అని, ఉంటే ఈ ఒంటెత్తు పోకడల వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ట్రిబుల్ టెస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అవగాహన లేకుండా జీవోలు, ఆర్డినెన్స్ లతో గందరగోళం సృష్టిస్తే సరిపోతుందా? అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదని, ఎందుకంత గోప్యత అని నిలదీశారు. బీసీ(BC)లు రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ అంశంలో వెనుకబడ్డారని సర్వేలో ఎందుకు నిరూపించలేకపోయారని లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అనుభవం గల అభిషేక్ మను సింగ్వి(Abhishek Manu Singhvi), అడ్వకేట్ జనరల్ కు ప్రభుత్వం చేసిన సర్వే డేటా గురించి తెలియకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీజేపీని విమర్శించే నైతిక విలువ బీఆర్ఎస్ కోల్పోయిందని విమర్శలు చేశారు.
Also Read; CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీకి రండి.. చైనా తర్వాత హైదరాబాద్ బెస్ట్.. అమెరికాకు సీఎం పిలుపు
కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్..
కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) లో బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామన్నారని, మరి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏ కోర్టులు అడ్డమొచ్చాయో చెప్పాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు దేవుడెరుగని, బీసీ(BC)లకు ఇచ్చిన ఇతర హామీలెందుకు అమలుచేయడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు కొత్త అని, కాంగ్రెస్ ది అభివృద్ధి వ్యతిరేక డీఎన్ఏ(DNA) అంటూ పైరయ్యారు. కాకా కాలేకర్ కమిషన్ రిపోర్ట్ ను చెత్త బుట్టలో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. క్యాస్ట్ సెన్సెస్ చేయడం ద్వారానే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుట్రలన్నీ ప్రజలు భగ్నం చేస్తున్నారని, తెలంగాణ(Telangana) సమాజం వాస్తవాలను గ్రహించి, కాంగ్రెస్ పన్నాగాలను గుర్తించాలని లక్ష్మణ్ కోరారు.
