Hardik Pandya Finally Broke His Silence On The Family Disputes
స్పోర్ట్స్

Hardhik Pandya: రూమర్స్‌పై క్లారిటీ 

Hardik Pandya Finally Broke His Silence On The Family Disputes: ఐపీఎల్‌లో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయి పక్కకు వచ్చినప్పటి నుంచి భార్యభర్తల మధ్య అగ్గిరాజుకుంది. గ‌త కొద్ది రోజులుగా హార్ధిక్ పాండ్యా న‌టాషా విడాకుల‌కి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో హ‌ల్‌చల్ చేస్తూ వైరల్ అయ్యాయి. దాని ప్రభావం వల్లే హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి తన భర్త పేరును తొల‌గించింద‌ని, పెళ్లి ఫొటోలను డిలీట్ చేసింద‌నే టాక్ న‌డిచింది. ఇక హార్ధిక్ ఆస్తిలో 70 శాతం భ‌ర‌ణం కూడా అడిగిన‌ట్టు ప్రచారాలు సాగాయి. అయితే వీరిద్ద‌రి విడాకుల‌కి సంబంధించి ప్రచారాలు జోరుగా సాగుతున్న టైంలో ఈ ఇద్దరు కలిసి పోయారనే ప్రచారం సాగింది.

నటాషా కూడా తన ఇన్​స్టా అకౌంట్​లో హార్దిక్​ ఫొటోలను మళ్లీ పోస్ట్ చేసిందని అన్నారు. ఈ నేప‌థ్యంలో హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేయ‌డంతో అంద‌రికి క్లారిటీ వ‌చ్చింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్, భారత్‌ల మ‌ధ్య హోరా హోరీ ఫైట్ జ‌రిగింది. స్కోరింగ్ గేమ్ అయిన కూడా మ‌జా అందించింది. భారత్ కేవలం 119 రన్స్‌కే కుప్పకూలగా, పాక్ జ‌ట్టుని 113 పరుగుల‌కి క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు భార‌త్ బౌల‌ర్స్. దీంతో భారత్ 6 రన్స్‌ తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసిస్తూ వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి స‌ర‌దాగా మాట్లాడారు.

Also Read: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదన్న ప్లేయర్

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాత హార్దిక్‌, రికీ మధ్య చిన్న ఇంట్రెస్టింగ్‌ కన్వర్జేషన్‌ జరిగింది. రికీ! ఆల్​ ఈజ్‌ ఎవ్రీథింగ్‌? హౌ ఈజ్‌ యుర్​ ఫ్యామిలీ అని హార్దిక్ పాండ్యా అడ‌గ‌గా, దానికి స్పందించిన రికీ పాంటింగ్.. అందరూ బావున్నారు, నీ ఫ్యామిలీ ఎలా ఉందని రికీ అడిగాడు. హార్దిక్ పాండ్యా, ఆల్ గుడ్, ఆల్ స్వీట్ అని రిప్లై ఇచ్చాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా డైవర్స్ వివాదానికి, రూమర్లకు ఫుల్‌ స్టాప్‌ పడినట్లు అందరూ భావిస్తున్నారు.

Just In

01

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?