DGP Shivdhar Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

DGP Shivdhar Reddy: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ముఖ్య సభ్యులు సరెండర్!

DGP Shivdhar Reddy: మావోయిస్టులు ఆయుధాలను విడిచి పెట్టి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్​ రెడ్డి(DGP Shivdhar Reddy) అన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో సాధించేది ఏమీ ఉండదని చెప్పారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటయ్య ఎలియాస్ రమేశ్ ఎలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకటరాజు ఎలియాస్ రాజు ఎలియాస్ ఎర్ర రాజు ఎలియాస్​ చందు, తోడెం గంగ ఎలియాస్ గంగవ్వ ఎలియాస్​ సోనీ శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్​ లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ పోలీసులు అవలంభిస్తున్న సమగ్ర వ్యూహానికి ఈ లొంగుబాట్లు నైతిక విజయమని పేర్కొన్నారు.

ఈ ఒక్క సంవత్సరంలోనే..

పార్టీ నాయకత్వం, కమిటీలు, వేర్వేరు విభాగాల మధ్య నెలకొన్న సిద్ధాంపరమైన విభేధాలు, అంతర్గత కలహాలు మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా పని చేసిన ఈ ముగ్గురు లొంగిపోవటానికి మరో కారణమని చెప్పారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 412మంది మావోయిస్టులు సరెండర్ అయినట్టు చెప్పారు. వీరిలో ఓ కేంద్ర కమిటీ సభ్యురాలు, నలుగురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు, ఎనిమిది మంది డివిజన్ కమిటీ సభ్యులు, ముప్పయి అయిదు మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్టు చెప్పారు. ఏళ్ల తరబడిగా అజ్ఞాతంలో ఉండి పని చేయటం వల్ల మావోయిస్టుల్లో చాలా మంది ఆరోగ్యపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.

Also Read: Bison Song: హీరోని ముద్దులతో తడిపేసిన అనుపమ.. సాంగ్ వైరల్!

తెలంగాణకు చెందిన వారు..

పైగా, ఆ పార్టీ సిద్ధాంతాలకు కాలం చెల్లిందన్నారు. ఇక, ఆపరేషన్​ కగార్​(Operation Kagar) కారణంగా కూడా మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో అంతర్గత విభేధాలు కూడా తలెత్తటం చాలా మందిని లొంగిపోయేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు 72మంది ఉన్నట్టు తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుల్లో పది మంది తెలంగాణావారే ఉన్నట్టు చెప్పారు. అందరూ అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు.

పోరు వద్దు.. ఊరు ముద్దు అనే పిలుపును మరోమారు ఇస్తున్నట్టు చెప్పారు. లొంగిపోయిన ముగ్గురిపై ఇరవై లక్షల రూపాయల చొప్పున రివార్డులు ఉన్నట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆ మొత్తాన్ని వారికి అంద చేస్తామన్నారు. దీనికి అదనంగా లొంగిపోయిన మావోయిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ప్రయోజనాలను కూడా కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ జీవితాలను గౌరవప్రదంగా గడిపే అవకాశాన్ని అందిస్తామన్నారు.

పార్టీలో విభేధాలు నిజమే..

ఇక, లొంగిపోయిన వెంకటయ్య ఎలియాస్ వికాస్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో విభేధాలు కొనసాగుతున్న మాట నిజమే అని చెప్పారు. పార్టీ అగ్రనేతల మధ్య ఇవి కొనసాగుతున్నాయన్నారు. ఇదేం కొత్త కాదని అంటూ మావోయిస్టుల్లో ఆధిపత్య పోరు సహజమే అని అన్నారు. ఇక, ఆయుధాలను విడిచి పెట్టాలన్న అంశంపై దండకారణ్యంలో విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోందని చెప్పారు.

Also Read: Astrology: వీటిని నేరుగా ఇతరుల చేతికి ఇస్తే మీ ఇంట్లోపేదరికం,గొడవలు తప్పవంటున్న జ్యోతిష్యులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!