Astrology : ప్రతి మనిషి ఈ భూమ్మీద సంతోషంగా, ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకుంటాడు. దీనిలో ఎలాంటి తప్పు లేదు. ఈ కోరికను నిజం చేసుకోవడానికి మనం ఎంతో కష్టపడతాం. కానీ, మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన అదృష్టాన్ని, దూరం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మన లైఫ్ లో ఈ వస్తువులను ఇచ్చిపుచ్చుకునే విధానంలో కొన్ని నియమాలున్నాయి.
ముఖ్యంగా, కొన్ని ముఖ్యమైన వస్తువులను చేతితో ఇవ్వడం వలన నెగెటివ్ శక్తులు ప్రవేశించి, మన జీవితాన్ని దెబ్బ తీస్తాయని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. మీ ఇంట్లో సంతోషం, ప్రశాంతత ఉండాలంటే, వీటిని మాత్రం ఎవరి చేతికి ఇవ్వకండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నీరు
దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం చాలా మంచిది. అయితే, నీటిని ఇచ్చే విధానం కూడా ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదు. చేతులతో దోసిలి పట్టి లేదా పాత్ర లేకుండా నేరుగా నీరు ఇవ్వడం దరిద్రాన్ని పిలిచినట్లే. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి , ఆర్థిక సమస్యలు వస్తాయి. కాబట్టి, నీటిని ఎప్పుడూ గ్లాసు, చెంబు లేదా సీసాలోనే ఇవ్వాలి.
Also Read: Youth Health Issues: యువతలో 65% మందికి అలాంటి సమస్య.. సర్వేలో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు
ఉప్పు
మన వంట గదిలో ఉప్పు తప్పకుండా ఉంటుంది. దీనిని నేరుగా చేతికి ఇవ్వకూడదని మన ఇంటి పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. దీని వెనుక పెద్ద కారణం ఉంది. ఉప్పును చేతితో తీసుకోవడం వలన ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయి, గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కూడా తెస్తుంది. అందుకే, ఉప్పు ఇవ్వాల్సి వస్తే ఒక గిన్నెలో లేదా పాత్రలో పెట్టి మాత్రమే ఇవ్వాలి.
మిరపకాయలు
మిరపకాయలు మన ఇళ్లలో ఉంటూనే ఉంటాయి. కూరల్లో కారం కోసం రోజూ వాడతాం. కానీ, వీటిని నేరుగా చేతికి ఇవ్వడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ సంబంధాల్లో కారం, ఘాటు చేరుతాయని జ్యోతిష్యం చెబుతోంది. భార్యభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు తలెత్తి, ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కాబట్టి, మిరపకాయలను ఎప్పుడూ ఒక గిన్నెలో లేదా పళ్లెంలో పెట్టి ఇవ్వడం ఉత్తమం. ఈ జాగ్రత్త మీ సంబంధాలను కాపాడుతుంది.
Also Read: Health Benefits: ఆ ఒక్క పండుతో 100 రోగాలకు చెక్ పెట్టొచ్చని తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
