Bison Song: ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇంటర్వ్యూ ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘టిల్లు స్వ్కేర్’ సినిమాలో ముద్దుల విషయంలో చాలా ఇబ్బంది పడ్డానని, అలా చేయడం ఇష్టం లేకపోయినా, చేయాల్సి వచ్చిందని చెబుతూ ఆ వీడియోలో అనుపమ ఫీలైంది. వాస్తవానికి మొదటి నుంచి ఆమె చాలా పద్ధతైన పాత్రలలోనే కనిపించారు. కానీ, సరైన హిట్ పడకపోవడంతో పాటు అవకాశాలు సన్నగిల్లడంతో గ్లామర్ ప్రదర్శన చేయక తప్పలేదు. కానీ, అది కూడా ఇష్టం లేకుండానే చేయాల్సి వస్తుందని అనుపమ చెప్పుకొచ్చింది. అలా చెప్పిన అనుపమ, ఇప్పుడు కోలీవుడ్ హీరోని ముద్దులతో తడిపేసింది. తాజాగా విడుదలైన ఓ సాంగ్‌లో హీరోకి వరసబెట్టి ముద్దులు పెడుతూనే ఉంది అనుపమ. ఈ సాంగ్ చూసిన వారంతా.. ‘టిల్లు స్క్వేర్’ టైమ్‌లో అంత ఫీలైన అనుపమ ఇలా ముద్దులు పెట్టి.. ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇంతకీ ఆ సాంగ్ ఏమిటని అనుకుంటున్నారా.. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Sai Kumar: నా 50 ఏళ్ల నట జీవితంలో ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది..
ఎమోషనల్‌గా కిస్ సన్నివేశం
నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బైసన్’ (Bison). ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా నటిస్తున్నారు. ధృవ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ‘తీరేనా’ అంటూ సాగే తెలుగు పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో లేని విధంగా ఈ పాట దాదాపు 7 నిమిషాలు ఉండటం విశేషం. మొదటి ఒక నిమిషం వరకు చాలా సైలెంట్‌గా నడిచిన ఈ పాట.. ‘గుండెల్లోన మండుతుంటే..’ అంటూ ఎమోషనల్‌గా మొదలైంది. పాట మధ్యలో హీరోకి అనుపమ పెట్టిన ముద్దులు.. పాటపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ సన్నివేశం చాలా ఎమోషనల్‌గానూ, హార్ట్ టచ్చింగ్‌గానూ ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో లిరిక్స్ అందించడం విశేషం. తెలుగులో ఈ పాటకు ఎనమంద్రా రామకృష్ణ సాహిత్యం అందించగా మనువర్ధన్ ఈ పాటను ఆలపించారు.
Also Read- Panjaram Trailer: ఒక కథ చెబుతా వింటారా? కానీ భయపడకండి!
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో..
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా.. తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నాకు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
