Ari Movie Team
ఎంటర్‌టైన్మెంట్

Sai Kumar: నా 50 ఏళ్ల నట జీవితంలో ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది..

Sai Kumar: నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ (Ari Movie) వంటి చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నానని అన్నారు డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Dialogue King Sai Kumar). ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్ వీ రెడ్డి) సమర్పణలో.. ‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న జయశంకర్ (Jayashankarr) దర్శకత్వంలో.. శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేకర్స్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను (Ari Movie Pre Release Event) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులెందరో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Deccan Sarkar: ‘దక్కన్ సర్కార్’ ఫస్ట్ లుక్ వదిలిన రాములమ్మ.. బిగ్ సపోర్ట్!

నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడు

ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు మా అమ్మ పురాణ ఇతిహాసాల గురించి చెబుతూ ఉండేది. అలా మాకు కూడా చాలా విషయాలు తెలిశాయి. ఈ చిత్ర దర్శకుడు జయశంకర్ అరిషడ్వర్గాల నేపథ్యంగా సినిమా కథ చెప్పిప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఆరు పాత్రలతో జయశంకర్ వండర్ క్రియేట్ చేశారు. ఇందులో ఆరు పాత్రలు ఎక్కడా కలవవు. అందుకే ఈ సినిమాను థియేటర్‌లో చూసేందుకు నేను కూడా వేచి చూస్తున్నాను. నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ వంటి ఒక చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాకు కనిపించే మూడు సింహాల్లాంటి నిర్మాతలు ఇక్కడ ఉంటే, కనిపించని ఆ నాలుగో సింహం లాంటి నిర్మాత ఆర్వీ రెడ్డి. ఆయన అమెరికాలో ఉంటారు. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. వినోద్ వర్మ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది. ఈ మధ్య గంగాధర శాస్త్రి భగవద్గీతకు వచనం చెప్పాను. జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చేస్తున్న ప్రాజెక్ట్‌కు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 108 శ్లోకాలకు తెలుగు వెర్షన్ నేనే చెప్పాను. అలాగే జీఎంఆర్ వాళ్లు భగవద్గీతను తెలుగులోకి తీసుకొస్తూ.. నన్నే వాయిస్ చెప్పమన్నారు. ఇదంతా చూస్తుంటే నాపై శ్రీకృష్ణుడు దయ చూపిస్తున్నాడనిపిస్తుంది. మనం ఆధునికంగా ఎంతైనా ఎదగవచ్చు.. కానీ, మన నాగరికత మర్చిపోకూడదు. సినిమా అనే పవర్ ఫుల్ మీడియా ద్వారా ఒక మంచి సందేశాన్ని చెప్పబోతున్నాం. ఇలాంటి గొప్ప సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరారు.

Also Read- Kantara Chapter 1: ఆ రికార్డుకు చేరువలో ‘కాంతార చాప్టర్ 1’.. కన్నడలో మరో వెయ్యి కోట్ల సినిమా!..

ఆ పాత్రలో ఉంది నేనే కదా..

చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా మనల్ని మనం చూసుకునే అద్దం వంటిది. అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను ఎంతోమంది సద్గురువులను కలిసి, ఎన్నో విషయాలు సేకరించి, ఒక ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పడం జరిగింది. నేను అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు.. సినిమాలోని ఏదో ఒక పాత్రతో మమేకమై.. ఆ పాత్రలో ఉంది నేనే కదా అని ఫీలవుతాడు. మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకుంటారు. నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిమ్మప్ప నాయుడు అండగా నిలబడ్డారు. సినిమాలోని ఆరు పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి. అందరికీ మంచి పేరును తీసుకువచ్చే సినిమా ఇదవుతుందనే నమ్మకంతో ఉన్నానని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?