Swetcha Effect ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha Effect: విధులకు డుమ్మా వేతనం పక్క..స్వేచ్ఛ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు

Swetcha Effect: విధులకు గైర్హాజరవుతూ, జీతం మాత్రం తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హుజురాబాద్ మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజేందర్ రాజుపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో ఆయన నిర్లక్ష్యంపై ‘స్వేచ్ఛ డైలీ న్యూస్’ పత్రికలో విధులకు డుమ్మా వేతనం పక్క విధుల పట్ల నిర్లక్ష్యం అనే కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి (DM&HO) ఆయనకు మెమో జారీ చేశారు.

Also Read: Sabarimala Gold Controversy: శబరిమలలో ‘బంగారం మిస్టరీ’.. ఎవరీ ఉన్నికృష్ణన్!

కథనంలో ఏముంది?

మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజేందర్ రాజు తరచుగా సరైన కారణం లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని, అయినప్పటికీ ప్రతినెలా ప్రభుత్వ వేతనం మాత్రం పొందుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ అంశంపైనే ‘స్వేచ్ఛ డైలీ న్యూస్’ పత్రిక ఇటీవల “విధులకు డుమ్మా  వేతనం పక్క” అనే శీర్షికతో సవివరమైన కథనాన్ని ప్రచురించింది.

ఉన్నతాధికారుల స్పందన

ప్రజారోగ్యానికి కీలకమైన మలేరియా విభాగం అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనంపై దృష్టి సారించిన జిల్లా వైద్యాధికారి (DM&HO) తక్షణమే స్పందించారు. రాజేందర్ రాజును వివరణ కోరుతూ మెమో జారీ చేశారు. విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో కారణాలు తెలపాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను స్పష్టం చేయాలని మెమోలో ఆదేశించారు.

కఠిన చర్యలు తప్పవు: DM&HO

ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. స్వేచ్ఛ పత్రిక కథనంపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Gutka Stains In Metro: కొత్తగా మెట్రో సేవలు లాంచ్.. 3 రోజులకే గుట్కా మరకలతో.. అధ్వాన్నంగా మారిన స్టేషన్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?