Chanakya Niti: ఆచార్య చాణక్యుడు అనగానే మనకీ ముందు గుర్తొచ్చేది ఆయన నీతి సూత్రాలు. వందల ఏళ్ళ క్రితం రాసిన చాణక్య నీతి శాస్త్రం నేటికీ అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా, భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి చాణక్యుడు చెప్పిన నీతి ఈ రోజుకీ కూడా చెక్కు చెదరలేదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎక్కువ కాలం భార్యతోనే గడుపుతాడు కాబట్టి, ఆమె వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. అయితే, ఇలాంటి లక్షణాలు ఉన్న భార్యతో కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని ఆయన చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
భర్తను అవమానించే భార్య
కొందరు భార్యలు తమ భర్తలను నిరంతరం ఎగతాళి చేస్తూ, వారి పనులను, నిర్ణయాలను తక్కువ చేసి మాట్లాడతారు. భర్త చేసే పని చిన్నదైనా, పెద్దదైనా, దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వైఖరి భర్త ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది. ఇటువంటి సంబంధం ఆనందాన్ని కాకుండా ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. అందుకే, ఇలాంటి భార్యతో కలిసి జీవించడం కంటే కంటే దూరంగా ఉండడమే మంచిదని చాణక్యుడు చెప్పారు.
స్వార్థపూరిత ఆలోచనలు గల భార్య
తమ సౌకర్యం, అవసరాల గురించి మాత్రమే ఆలోచించే భార్యలు భర్త శ్రమను, కష్టాలను కొంచం కూడా పట్టించుకోరు. భర్త ఉద్యోగంలో లేదా వ్యాపారంలో రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినా, అతని ఆరోగ్యం, విశ్రాంతి వంటి అవసరాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి స్వార్థపూరిత ప్రవర్తన ఇంట్లో అసంతృప్తిని, అశాంతిని సృష్టిస్తుంది. భర్త శారీరక, మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి భార్యతో జీవనం కొనసాగించడం చాలా కష్టమని చాణక్యుడు హెచ్చరిస్తాడు.
భర్తను సమాజంలో తక్కువ చేసే భార్య
కొందరు భార్యలు ఇతరుల ముందు తమ భర్తల గురించి అవమానకరంగా మాట్లాడతారు. భర్తలోని మంచి లక్షణాలను మర్చి, అతన్ని చులకనగా చూస్తూ, తాము అతని కంటే ఉన్నతమని చెప్పుకుంటారు. ఇలాంటి ప్రవర్తన సంబంధంలో చీలికను తెస్తుంది. భర్త ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి భార్యతో జీవనం కొనసాగించడం కంటే విడిపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు.
