Gadwal District (IMAGE CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

Gadwal District: ఈ ఎరువులతో పంటలకు జీవం.. వరి సాగులో ఆ జిల్లానే ప్రథమ స్థానం

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District)లో వరి సాగులో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు సాగుకు అనుకూలంగా ఉండడంతో దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తోంది. పండించిన ధాన్యానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో రైతుల( Farmers)కు వరి సాగు కలిసి వస్తోంది. మరోవైపు అధిక రసాయనాల వాడకం కారణంగా గత మూడేళ్లుగా మోగి పురుగు విజృంభిస్తోంది. దీనికి తోడు వివిధ రకాల తెగుళ్లు పైరును ఆశిస్తున్నడంతో రైతులు పంటను కాపాడుకునేందుకు నారుమడి నుంచి విచ్చలవిడిగా రసాయన మందులను పిచికారి చేస్తున్నారు. ప్రస్తుతం పొలాలు పొట్ట దశలో ఉండగా కొన్నిచోట్ల పిలక దశలో ఉన్నాయి.

జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.29 లక్షల ఎకరాలు 

ఇప్పటివరకు ఒక్కో రైతు సగటున మూడు నుంచి నాలుగు దఫాలుగా యూరియాను వినియోగిస్తున్నారు. మరోవైపు తెవుల నివారణకు పంట చేతికి వచ్చేసరికి మరో రెండు సార్లు పిచికారి చేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.29 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేస్తుండగా వరి సాగు విస్తీర్ణం 93 వేల 899 ఎకరాలు జూరాల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం,తుంగభద్ర, ఆర్డిఎస్ ఆయకట్టు కింద వరి పంట సాగు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రైతులు అధిక రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూసారం తగ్గి పంటను దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి.. బీఆర్ఎస్ ఇన్‌చార్జి కీలక వ్యాఖ్యలు

సేంద్రియ ఎరువులే శ్రేయస్కరం 

రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువుల వినియోగిస్తే పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. అంతేగాక భూములలో భూసారం పెరుగుతుంది. అయితే రైతులు వీలైనంతవరకు రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే పంటకు అన్ని రకాల పోషకాలు అందుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పెరుగుతున్న రసాయనాలు వాడకం

రైతులు వేసిన ప్రతి పంటలో అధిక దిగుబడిలో సాధించాలనే ఉద్దేశంతో వివిధ రకాల ఫర్టిలైజర్ బస్తాలను వాడుతున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో కరిగేట అనంతరం నారపెట్టిన తొలి రోజులలోనే పైరుకు తెగుళ్ల వ్యక్తి పెరుగుతోంది. యూరియా వాడకం వల్ల పండించిన ఆహార ధాన్యాల వినియోగం వల్ల నార్త్ ఇండియాలో క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరిలో ముఖ్యంగా మోగి పురుగు తగిలింది. నాటు వేసిన 15 రోజులకు గుళికలతో పాటు యూరియాలో రసాయన మందులను కలిపి పొలంలో చల్లారు.

అనంతరం రెండో విడతలో భాగంగా నెల తర్వాత ప్రస్తుత ఖరీఫ్ పంటలో వరికి మోగి పురుగు,ఉల్లి కోడు,కాండం తొలిచి పురుగు, సుడి దోమపోటు సోకుతోంది. దీంతో వాటి నివారణకు వివిధ రకాల మందులను పిచికారి చేయాల్సి వస్తోందని రైతులు తెలిపారు. సుడి దోమ వ్యాప్తి చెందడంతో పాటు ఒక్కో రైతు పంట కాలం పూర్తయ్యేసరికి ఎకరాకు 15 వేల విలువగల ఖరీదైన రసాయన మందులను చల్లుతున్నారు. దీనికి బదులు సేంద్రియ రోడ్డు జీవామృతం లాంటి ద్రవపదార్థాలు వాడితే బాగుంటుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు

పశువుల ఎరువులు శ్రేయస్కరం

సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్టు వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో జీవన ఎరువులు లాంటివి ఎక్కువగా రైతులు వినియోగించడం వల్ల పంట నాణ్యత, దిగుబడి పెరగడంతో పాటు భూమి సమస్యలత నెలకొంటుంది. కొందరికి ఎరువుల లభ్యత లేక ఇష్టానుసారంగా రసాయన మందులను వినియోగిస్తుండడం వల్ల భూసారం కోల్పోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం నెలకొంది.

ఏటా భూసార పరీక్షలు చేసుకోవాలి

ప్రతి యేటా భూసార పరీక్షలు చేసుకోవడం ఉత్తమమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో భూమిలో ఎంత మేరకు ఎరువులు వాడాలి.ఏ ఏ ఎరువులు వాడాలో తెలుస్తుందన్నారు నాట్లు వేసిన తర్వాత రైతులు సరైన సమయంలో సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నారు వ్యవసాయ అధికారులు సూచనల ప్రకారం ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో పంట చివరి దశ వరకు రెండు మూడు దఫాలుగా చల్లుకోవాలి. యూరియా రూపంలో నత్రజని వాడినప్పుడు బస్తాకు 10 కిలోల వేప పిండి వేసుకుంటే ఉత్తమమని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

దిగుబడులు తగ్గుతున్నాయి : సుదర్శన్ రెడ్డి..లత్తిపురం, గద్వాల

ప్రస్తుత ఖరీఫ్ లో వరి పంట సాగు చేస్తుండగా ఇప్పటికే మోగి పురుగు, ఉల్లికోడు, కాండం తొలిచేపురుగు, సుడిదోమ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రతి ఏటా 28 కింటాలు ఎకరాకు వస్తుండగా ఈ దఫా 22 క్వింటాలు దాటే పరిస్థితి లేదు. ఇప్పటికే గత రబీ సీజన్ కు సంబంధించిన బోనస్ అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పెట్టుబడుల రూపంలో సాగుకు అధిక వ్యయమవుతోంది.

Also Read: Jogulamba Gadwal district: గద్వాల జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది