World Destruction: భూమి పుట్టి ఇప్పటికీ 450 కోట్ల ఏళ్ళ పైనే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 మాస్ ఎక్స్‌టింక్షన్స్ జరిగాయి. అంటే, ఆస్టరాయిడ్స్ పడటం, అగ్ని పర్వతాలు పేలడం , భూకంపాలు , సునామీలు రావడం వలన జీవులన్నీ అంతరించిపోయాయి. గతంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. గత 125 ఏళ్లలో ఎప్పుడు కురవని విధంగా వర్షాలు పడ్డాయి. యావరేజ్ గా 61 మిల్లీ మీటర్లు పడగా.. 2025 లో మాత్రం ఈ యావరేజ్ 126 మిల్లీ మీటర్లకు రీచ్ అయింది. అంటే 106% ఎక్కువ కురిశాయి.
Also Read: World Destruction: కరోనా హింట్ ఇచ్చిందా.. ఈ ఒక్క ఏడాదే వంద శాతానికి మించిన వర్షాలు దేనికి పడ్డాయి?
ఆ ప్రళయం వస్తే మొత్తం అంతమవుతుందా?
ఐదేళ్ళ క్రితం కరోనా వైరస్ మనుషులు ఎలా చేసిందో మనందరికీ తెలిసిందే. లక్షల్లో మరణాలు చూశాము. ఇంకా ఇవి మాత్రమే కాదు.. గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం, తుపాన్లు, వరదలు రావడం, భూకంపాలు రావడం, ఎన్నో లక్షల ఎకరాల అడవులు మంటల్లో మండటం, భారీగా ఐస్ కరిగిపోవడం, కొన్ని రకాల జంతువులు అంతరించిపోవడం, అసలు భూమి మళ్ళీ తనకు తాను తిరిగి తెచ్చుకుంటుందా? వీటి మీద అదే పనిగా పరిశోధనలు చేసిన శాస్త్ర వేత్తలు మనం కొత్త ఎక్స్‌టింక్షన్స్ దగ్గరగా ఉన్నామని అంటున్నారు. కానీ, ఈ సారి ఆస్టరాయిడ్స్, అగ్ని పర్వతాలు బద్దలు అవ్వడం కాదు. ఈ సారి వచ్చే ఎక్స్‌టింక్షన్స్ కి కారణం మనుషులు చేసే పనులు. అవును మీరు చదువుతున్నది నిజమే.
అంతకముందు జరిగిన 5 ఎక్స్‌టింక్షన్స్ గురించి మాట్లాడుకుంటే.. ఒకటోది 44 కోట్ల ఏళ్ళ క్రితం జరిగింది. అప్పుడు వాతావరణం మొత్తం మారిపోవడంతో ఉష్ణోగ్రతలు చాలా డౌన్ అయ్యి భూమి మీద ఉన్న 85% జీవులు అంతరించిపోయాయి. రెండోది 37 కోట్ల ఏళ్ళ క్రితం జరిగింది. అప్పుడు భూమి పై ఆక్సిజన్ లెవెల్స్ భారీగా తగ్గడం వలన ఆ కాలంలో ఉన్న 75% శాతం జీవులు అంతరించి పోయాయి.ఇక మూడోది 25 కోట్ల ఏళ్ళ క్రితం జరిగింది. దీనిలో భారీగా అగ్ని పర్వతాలు పేలాయి. దీనిలో దాదాపు 96% జీవులు అంతరించిపోయాయి. ఇక నాలుగోది 20 కోట్ల ఏళ్ళ కిత్రం జరిగింది. ఈ టైం లో కూడా వర్షాలు యాసిడ్ రెయిన్స్ లాగా కురిశాయి. అప్పుడు 80% జీవులు అంతరించిపోయాయి. ఇక ఐదోది 6 కోట్ల ఏళ్ళ క్రితం జరిగింది. డైనోసార్లు ఈ పీరియడ్స్ లోనే అంతరించిపోయాయి. అలా వాటితో పాటు మొత్తం 75% జీవులు అంతరించిపోయాయి.
Also Read: Skin Care: మనం రోజూ వాడే సబ్బులు మంచివి కావా?
గమనిక: ఇక్కడ అందిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పిన వివరాలు, పొందుపరిచిన సమాచారం ఆధారంగా యధావిథిగా అందించిన కథనం ఇది. దీనికి స్వేఛ్చ ఎటువంటి బాధ్యత వహించదు.
