upsc ese ( Image Source: Twitter)
జాబ్స్

UPSC ESE 2026: యూపీఎస్సీ లో ఇంజనీరింగ్ జాబ్స్.. వెంటనే, అప్లై చేయండి!

UPSC ESE 2026: UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 474 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష (ESE) 2026కి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 26, 2025న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ టెక్నికల్ పోస్టులకు (గ్రూప్ A, B) మొత్తం 474 ఖాళీల భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు UPSC అధికారిక వెబ్‌సైట్ (www.upsc.gov.in) (www.upsc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేదీ – సెప్టెంబర్ 26, 2025
దరఖాస్తు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 26, 2025
దరఖాస్తు ముగింపు తేదీ – అక్టోబర్ 16, 2025
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 8, 2026 (ఆదివారం)
మెయిన్స్ పరీక్ష తేదీ: జూన్ 21, 2026

దరఖాస్తు రుసుము

కేటగిరీ రుసుము

జనరల్ / OBC / EWS – రూ.200/- ను చెల్లించాలి.
SC/ST/PwBD – ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
మహిళలు – ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

వయోపరిమితి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు కలిగి ఉండాలి
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు కలిగి ఉండాలి
SC/ST (5 సంవత్సరాల వరకు), OBC (3 సంవత్సరాల వరకు), PwBD (10 సంవత్సరాల వరకు) ఇతరులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

UPSC ESE 2026కి అర్హతలు నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతలను దరఖాస్తు ముందు తప్పకుండా తనిఖీ చేసుకోవాలి:

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్‌లో (B.E./B.Tech) లేదా సంబంధిత ఫీల్డ్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ పరీక్షల సమయంలో డిగ్రీ పూర్తి చేయాలి.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ A పోస్టులకు ప్రారంభ జీతం రూ.56,100/- (లెవల్ 10, 7వ పే గ్రేడ్ పే కమిషన్ ప్రకారం). గ్రూప్ B పోస్టులకు రూ.35,400/- (లెవల్ 7). ఇతర ప్రయోజనాలు: HRA, DA, మెడికల్ అలవెన్సెస్, పెన్షన్ మొదలైనవి. పోస్టులు: ఇండియన్ రైల్వే, CPWD, మెస్, డీఆర్‌డీ వంటి సంస్థల్లో.

ఆన్‌లైన్ ఎలా దరఖాస్తు చేయాలంటే?

1. ముందుగా UPSC అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి.
2. ఆ తర్వాత ‘ ఆన్లైన్ అప్లికేషన్స్ ‘ని క్లిక్ చేయండి.
3. ‘ ఇంజీనీరింగ్ సర్వీసెస్ Examination, 2026’కి ‘ అప్లై ఆన్లైన్ ‘ లింక్‌ను ఎంచుకోండి.
4. OTR (One Time Registration) పూర్తి చేసి, ఫారమ్‌ను ఫిల్ చేయండి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రుసుమును చెల్లించండి.
6. ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి.

 

Just In

01

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?

Trains cancelled: చలికాలం ఎఫెక్ట్.. 3 నెలల పాటు రైళ్లు రద్దు.. భారతీయ రైల్వే షాకింగ్ ప్రకటన

Liquor Shops: రాష్ట్రంలో మరో 19 కొత్త మద్యం షాపులకు నేడు నోటిఫికేషన్..!