John Wesley: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం: జాన్ వెస్లీ
John Wesley (imagecredit:twitter)
Political News, Telangana News

John Wesley: బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ వ్యతిరేకం: జాన్ వెస్లీ

John Wesley: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వమే వ్యతిరేకమని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) అన్నారు. గురువారం ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపితేనే రిజర్వేషన్లు సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నిర్వహణపై హైకోర్టు స్టే విధించడంతో అంతా నిలిచిపోయిందని చెప్పారు. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు.

పోరాటానికి సిద్దం కండి..

రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు, మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం కోరే శక్తులు, ప్రజాస్వామికవాదులంతా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దమైన చర్యలన్నీ తీసుకోవాలని కోరారు. కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించ లేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్‌ చేసి గవర్నర్‌కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు నిలిచిపోయాయని వివరించారు.

Also Read: Balayya vs Karthi: ఆసక్తికరమైన పోరు.. నటసింహానికి పోటీగా కోలీవుడ్ హీరో!

అధికారంలో బీజేపీ..

బీజేపీ కులతత్వ, మనువాద పార్టీ అయినందున, కుల వ్యవస్థ, అసమానతలు ఉండాలని, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని కోరుకుంటుందన్నారు. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ(BJP) ఎంపీ(MP)లు, మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తేనే సాధ్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Qatar Airways: 85 ఏళ్ల శాకాహారికి.. నాన్ వెజ్ పెట్టిన విమాన సిబ్బంది.. తర్వాత జరిగింది ఇదే!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..