Heroes Multiplex Empire
ఎంటర్‌టైన్మెంట్

Tollywood Heroes: టాలీవుడ్ హీరోల మల్టీప్లెక్స్ బిజినెస్ వెనుక ఇంత కథ ఉందా?

Tollywood Heroes: సినిమా అంటేనే బిజినెస్. అయితే, తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు హీరోలు కేవలం నటనకు, నిర్మాణానికే పరిమితం కాకుండా సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే, మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్. ఒక వైపు థియేటర్లకు ఆదరణ తగ్గిందంటూనే, మరోవైపు స్టార్ హీరోలు భారీగా ఈ మల్టీప్లెక్స్‌ల నిర్మాణంలో పెట్టుబడులు పెడుతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ వంటి అగ్ర హీరోలు. వీరంతా తమ బ్రాండ్‌ను, మార్కెట్‌ను ఉపయోగించుకొని విలాసవంతమైన మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు.

థియేటర్ల బిజినెస్ వెనుక మ్యాటర్ ఇదే

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఓటీటీ (OTT) ప్రభావం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోంది అనే వాదన బలంగా ఉంది. మరి అలాంటప్పుడు, కోట్లాది రూపాయలు పెట్టి మల్టీప్లెక్స్‌లను ఎందుకు నిర్మిస్తున్నారు? అనే అనుమానం కలుగక మానదు. దీని వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్ ఏమిటంటే, ఈ బిజినెస్ కేవలం సినిమా టికెట్ల అమ్మకానికి మాత్రమే పరిమితం కాదు. మల్టీప్లెక్స్‌లు కేవలం సినిమా ప్రదర్శన కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రాఫిటబుల్ రియల్ ఎస్టేట్, లైఫ్ స్టైల్ హబ్‌లుగా మారుతున్నాయి. ఈ కాంప్లెక్స్‌లలో అనేక ఇతర బిజినెస్‌లు నడుస్తున్నాయి. దుకాణాలు, షోరూమ్‌లు, ప్రముఖ రెస్టారెంట్లు, కేఫ్‌లు, గేమింగ్ జోన్స్, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ అవుట్‌లెట్స్, ప్రీమియం పార్కింగ్ ఫీజులు ఇలా ఎన్నో ఉన్నాయి.

Also Read- Srinidhi Shetty: రొమాంటిక్ స్టోరీస్ చేయడమంటే ఇష్టం.. ఏదో తేడాగా ఉందేంటి?

సినిమాకు వచ్చే జనం, ఈ ఇతర వ్యాపారాలకు కూడా కస్టమర్‌లుగా మారుతున్నారు. ముఖ్యంగా, మల్టీప్లెక్స్ లోపల ఉండే రిటైల్, ఫుడ్ కోర్ట్స్ స్పేస్‌లకు అద్దె రూపంలో వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుంది. హీరోల పేరు, వారి మల్టీప్లెక్స్ బ్రాండ్ వాల్యూ కారణంగా, ఈ కాంప్లెక్స్‌లలో స్థలం తీసుకోవడానికి అనేక పెద్ద బ్రాండ్‌లు ఆసక్తి చూపుతాయి. దీనివల్ల, థియేటర్ టికెట్ల ఆదాయంతో సంబంధం లేకుండా, రియల్ ఎస్టేట్, రెంటల్ ఆదాయం ద్వారానే కొన్ని కోట్ల లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.

హీరోల బ్రాండింగ్ అడ్వాంటేజ్

హీరోలు ఈ బిజినెస్‌లోకి రావడానికి మరో ప్రధాన కారణం, తమ బ్రాండింగ్ అడ్వాంటేజ్. స్టార్ హీరోలు మల్టీప్లెక్స్‌ను ప్రారంభిస్తే, అది సహజంగానే పబ్లిసిటీ పొందుతుంది. ఉదాహరణకు, మహేష్ బాబు ఏషియన్ సినిమాస్‌తో కలిసి ప్రారంభించిన మల్టీప్లెక్స్‌, అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్.. వారి స్టార్‌డమ్‌తో అదనపు ఆకర్షణను సంతరించుకున్నాయి. సినిమా పరిశ్రమలో తమకున్న పరిచయాలు, మార్కెట్ పరిజ్ఞానం ఈ వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తుంది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా, సినిమా రిలీజ్‌ల సమయంలో తమ మల్టీప్లెక్స్‌లకు మెరుగైన ప్రదర్శన సమయాలు (షో టైమింగ్స్) కేటాయించుకునేందుకు వారికి కొంత వ్యాపారపరమైన సౌలభ్యం కూడా ఉంటుంది.

Also Read- Bison Song: హీరోని ముద్దులతో తడిపేసిన అనుపమ.. సాంగ్ వైరల్!

మొత్తంగా, టాలీవుడ్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లో అడుగుపెట్టడం అనేది కేవలం సినిమాపై ప్రేమతోనో, ప్రేక్షకులపై అభిమానంతోనో కాకుండా.. స్థిరమైన, భారీ రాబడిని అందించే రియల్ ఎస్టేట్ ఆధారిత వ్యాపార విజన్‌తో కూడుకున్నదని స్పష్టమవుతోంది. ఇది టాలీవుడ్‌లో సినిమాతో ముడిపడిన వ్యాపార విస్తరణకు ఒక కొత్త మార్గాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!