Niharika NM: నా సీన్ వస్తుంటే నా ఫ్యామిలీ కళ్లు మూసుకోకూడదు
Niharika NM
ఎంటర్‌టైన్‌మెంట్

Niharika NM: నా సీన్ వస్తుంటే నా ఫ్యామిలీ కళ్లు మూసుకోకూడదు.. అలాంటి పాత్రలే చేస్తా!

Niharika NM: నిహారిక ఎన్ఎం ఆ మధ్య ఈ పేరు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సరసన ఈ భామ కనిపించడంతో, ఎవరీమే అనేలా సెర్చింగ్ మొదలైంటి. కట్ చేస్తే, ఇప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం జంటగా విజయేందర్ దర్శకత్వంలో.. బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిహారిక ఎన్‌ఎం మీడియాకు చిత్ర విశేషాలను (Niharika NM Interview) చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Bison Song: హీరోని ముద్దులతో తడిపేసిన అనుపమ.. సాంగ్ వైరల్!

అందుకే లేటయ్యింది

‘‘నేను హీరోయిన్‌గా పరిచయమవ్వాలని అనుకున్న తర్వాత ముందుగా ‘మిత్రమండలి’ కథనే విన్నాను. కానీ, ఈ సినిమా కంటే ముందు ‘పెరుసు’ అనే తమిళ చిత్రం ముందుగా విడుదలైంది. ‘మిత్ర మండలి’ ఆలస్యానికి కారణం ఇందులో ఉన్న భారీ క్యాస్టింగ్. అందరి డేట్స్ అడ్జస్ట్ అయ్యి, సినిమా పూర్తయ్యే సరికి టైమ్ గడిచిపోయింది. అన్నింటినీ దాటుకుని ఇప్పుడీ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో నేను చాలా సాఫ్ట్ పాత్రను పోషించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నేను అందరికీ పరిచయమే. కానీ సినిమాల్లో నటించడం నాకు కొత్తగా, ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన చిత్రాలన్నీ కామెడీ బేస్డ్ చిత్రాలే. అందుకే, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవాలని చూస్తున్నాను. ఈ సినిమాలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయి. అందరినీ నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. థియేటర్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ హాయిగా నవ్వుకుని ఇంటికి వెళ్తారు.

Also Read- Sai Kumar: నా 50 ఏళ్ల నట జీవితంలో ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది..

కళ్లు మూసుకునేలా ఉండకూడదు

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవం ఉంటుంది. ఇండస్ట్రీ గురించి బయట మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ, నేను ఒక్కటే నమ్ముతాను. మనం మన హద్దుల్లో ఉంటే ఏమీ కాదు. ఎవరూ ఏమీ చేయలేరు. ముఖ్యంగా తెరపై నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ హాయిగా చూసుకునేలా ఉండాలి. నేను నటించిన సన్నివేశం వస్తుంటే వాళ్లు కళ్లు మూసుకునేలా ఉండకూడదు. అలాంటి పాత్రలు ఎప్పటికీ చేయను. తెలుగు చిత్ర పరిశ్రమ నాకెంతో నచ్చింది. ఇక్కడ నాకు సాదరంగా స్వాగతం లభించింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు నన్ను ఒక సొంత ఫ్యామిలీలా చూసుకున్నారు. ఇక్కడ దొరికినంత ప్రేమ, కంఫర్ట్ నాకు ఇంకెక్కడా దొరకలేదు. షూటింగ్ టైమ్‌లో అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. మంచి మంచి సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..