Deccan Sarkar: ‘దక్కన్ సర్కార్’ చిత్రానికి లేడీ సూపర్ స్టార్, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanthi) సపోర్ట్ అందించారు. తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత కళా శ్రీనివాస్ (Kala Srinivas) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘దక్కన్ సర్కార్’ (Deccan Sarkar). ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం బంజారాహిల్స్ రోడ్ నెం 12లో జరిగింది. విజయశాంతి ఈ పోస్టర్‌ని ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే, చిత్ర హీరో చాణక్య, చిత్ర హీరోయిన్ మౌనిక పాల్గొన్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తే.. ఉద్యమ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రంగా అనిపిస్తోంది. టైటిల్‌ని గన్‌తో సెట్ చేసిన తీరు ఆకర్షిస్తోంది. తెలంగాణ ప్రాంత కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా పోస్టర్ చూస్తుంటే తెలిసిపోతుంది.
Also Read- Bigg Boss Telugu 9: డే 32.. ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్, అవుటాఫ్ రేస్.. టార్గెట్ సంజన!
నా వంతు కృషి చేస్తా..
పోస్టర్ విడుదల అనంతరం లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న రచయిత, ప్రజా కళాకారుడు కళా శ్రీనివాస్ నిర్మిస్తున్న ‘దక్కన్ సర్కార్’ సినిమా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చిత్రం. మంచి కంటెంట్‌తో, రియల్ ఇన్సిడెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లాలి. ఈ చిత్ర విజయానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సినిమా అప్డేట్స్ చూస్తే.. దాదాపు 100 మంది నటీనటులు, 50 మంది సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం కృషి చేశారని తెలిసింది. వారందరి కోసం ఈ సినిమా విజయవంతం అవుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.
Also Read- Naga Chaitanya: శోభితనే నా బలం.. నా లైఫ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఆమెకే!
తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే సినిమా
సీనియర్ ఉద్యమకారుడు, కళాకారుల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే ఇలాంటి సినిమాల నిర్మాణం ఇంకా ఇంకా జరగాలి. ప్రభుత్వం తెలంగాణ సినిమాలను, కళాకారులను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్రయూనిట్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు, నిర్మాత కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇది ప్రజల జీవన స్థితిగతుల కథ. సహజ సంఘటనలను బేస్ చేసుకొని, అంతే సహజ సిద్ధంగా నిర్మించడం జరిగింది. 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈ సినిమాను పూర్తి చేశాం. నేను ఎంతగానో అభిమానించే తార రాములమ్మ ఈ సినిమాకు సపోర్ట్ చేయడం చాలా గొప్పగా అనిపించింది. ఈ సందర్భంగా ఆమెకు, మిగతా అతిథులకు, నాకు సహకరించిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు చాణక్య, నటి మౌనిక మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
