Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) షో 32వ రోజుకు చేరుకుంది. హౌస్‌లో 32వ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్ అంటూ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఎంటర్‌టైన్ చేస్తూనే.. కంటెస్టెంట్స్ మధ్య వివాదానికి కారణంగా నిలిచింది. ముఖ్యంగా సంజన (Sanjjanaa Galrani) ఈ ఫిజికల్ టాస్క్ నా వల్ల కాదు.. నేను బిగ్ బాస్ వదిలి వెళ్లిపోతానంటూ ఏడ్చేసింది అంటే ఏ రేంజ్‌లో ఈ టాస్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. డే 32కు సంబంధించి తాజాగా రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ట్విస్ట్‌లు కూడా ఉన్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో ఉన్న ఇద్దరు సభ్యులకు బిగ్ బాస్ కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఆ అధికారంతో లీడర్ బోర్డులో చివరిలో ఉన్న రెండు టీమ్స్‌లో ఒకరిని రేసు నుంచి తొలగించవచ్చని బిగ్ బాస్ చెబుతున్నారు. ఈ రెండు ప్రోమోలతో.. గురువారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుందనే హింట్‌ని బిగ్ బాస్ ఇచ్చారు. ముందుగా మొదటి ప్రోమోలో అసలేముందనేది గమనిస్తే..
Also Read- OTT Movies: ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తుంది.. ఎక్కడుందంటే?
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి
ప్రోమో స్టార్టింగ్‌లో టాస్క్‌కు సంబంధించిన ఐటమ్స్‌ని చూపిస్తూ.. ‘ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది’ అని బిగ్ బాస్ చెబుతూ.. ‘ఎంటర్‌టైన్ అవడం ఎంత ముఖ్యమో.. టాస్క్‌లో గెలవడం కూడా అంతే ముఖ్యం’ అని హౌస్ సభ్యులకు సూచించారు. మ్యూజిక్ ఆగగానే గోడకు ఉన్న కలర్ హోల్స్‌లో బిగ్ బాస్ చెప్పిన కలర్ హోల్ నుంచి బయటకు రావాలనే టాస్క్ విధించారు. బిగ్ బాస్ కలర్ చెప్పే వరకు, సినిమా పాటలకు కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేస్తూ అలరించారు. కలర్ చెప్పగానే హోల్స్‌లోకి వెళ్లేందుకు పోటీ పడ్డారు. ఈ పోటీలో భరణి, దివ్య అత్యధిక మార్కులు సాధించి లీడర్ బోర్డులో అగ్ర స్థానానికి చేరుకున్నారు. ఈ గేమ్ మధ్యలో తనూజ (Tanuja), దివ్య(Divya)ల మధ్య వాగ్వివాదం నడిచింది. ‘నేను ఇక్కడ ఉండలేను, ఇంటికి వెళ్లిపోతాను.. ఇంత ఫిజికల్ టాస్క్ నాతో అవదు’ అంటూ కెమెరా ముందుకు వచ్చిన సంజన భోరున విలపిస్తుంది. ఇంతటితో ఈ ప్రోమో ముగిసింది.
అవుటాఫ్ రేస్
ప్రోమో 2 విషయానికి వస్తే.. కెప్టెన్ రాము రాథోడ్ (Ramu Rathod)ని సరదాగా సంజన, రీతూ చౌదరి ఆటపట్టిస్తున్నారు. ‘రాను ముంబైకి రాను’ పాటని వాళ్ల వెర్షన్‌లో రాము పేరు వచ్చేలా.. ‘మేము రాము బయటికి రాము’ అని సంజన, రీతూ అల్లరల్లరి చేస్తుంటే.. రాము బిక్క ముఖం పెట్టుకుని అలాగే వారిని చూస్తున్నాడు. ఆ అల్లరిని హౌస్ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఇమ్ము వచ్చి.. ‘వాళ్లు బయటకు వెళ్లకపోతే.. ఎత్తుకుని బయటకు తీసుకెళ్లే ఆప్షన్ కూడా ఉంటుంది’ అనగానే.. రీతూని ఎత్తుకోవడానికి రాము ట్రై చేస్తున్నాడు. ఆ వెంటనే ఇంటి సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి.. మొదటి స్థానంలో ఉన్న భరణి (Bharani), దివ్యలకు బిగ్ బాస్ ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఆ అధికారంతో.. ఫ్లోరా, సంజనలను వారు రేసు నుంచి తీసేస్తున్నట్లుగా ప్రకటించారు. చివరిలో ఉన్న శ్రీజ, సుమన్ శెట్టిని కాకుండా అంతకు ముందు ఉన్న ఫ్లోరా, సంజనలను రేసు నుంచి తొలగించి, వారి కారణాలు వారు చెప్పారు. దీనిపై సంజన వాగ్వివాదానికి దిగింది. ఎంత ఆడినా కూడా చులకనగా చూస్తున్నారంటూ, ఎవరూ సపోర్ట్ చేయడం లేదంటూ.. కర్మ రిపీట్ అవుతుందంటూ కాస్త సీరియస్‌గానే సంజన రియాక్టైంది. మళ్లీ ఫైట్ చేస్తా బిగ్ బాస్ అంటూ సీరియస్‌గా వెళ్లి కూర్చుంది. ఇలా రెండో ప్రోమో.. షో పై మరింతగా ఇంట్రస్ట్‌ని కలిగించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
