acb caught red handed ccs ci sudhakar taking 3 lakhs of bribe | ACB: లంచం డబ్బులతో పోలీసు పరుగులు.. చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ
currency cash money
క్రైమ్

ACB: లంచం డబ్బులతో పోలీసు పరుగులు.. చేజ్ చేసి పట్టుకున్న ఏసీబీ

Bribery: ఏసీబీ అధికారులు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. ఏ శాఖ అయినా సరే లంచగొండి అధికారులను పట్టుకుని వారి అక్రమ వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నారు. రెండు వారాల క్రితమే సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. తాజాగా సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ సుధాకర్ లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తాను లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులను చూసిన సుధాకర్ ఆ డబ్బులతో సహా నడిరోడ్డుపై పరుగులు పెట్టాడు.

సీసీఎస్‌లో టీం 7 సీఐ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ లంచాలు తీసుకుంటున్నట్టు ఏసీబీకి ఉప్పందింది. పక్కాగా ప్లాన్ వేసి ఈ రోజు రంగంలోకి దిగింది. బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకుంది. ఓ కేసుకు సంబంధించి రూ. 15 లక్షల లంచాన్ని సీఐ సుధాకర్ బాధితుడి వద్ద నుంచి డిమాండ్ చేసినట్టు తెలిసింది. అందులో రూ. 3 లక్షలు బాధితుల నుంచి తీసుకుంటూ ఉండగా ఏసీబీ పట్టుకుంది.

అక్కడ ఏసీబీ అధికారులను చూడగానే సీసీఎస్ టీం 7 సీఐ సుధాకర్ సీసీఎస్ నుంచి బయటికి పరుగులు పెట్టాడు. లంచంగా తీసుకున్న డబ్బులను చేతపట్టుకునే నడిరోడ్డుపై పరుగు తీశాడు. ఏసీబీ అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ లంచగొండి అధికారిని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. బషీర్ బాగ్ సీసీఎస్ ఆఫీసులో సోదాలు చేశారు.

Just In

01

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!