Chalo Bus Bhavan: హైదరాబాద్ సిటీ బస్ టికెట్ల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ‘చలో బస్ భవన్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు. బస్ భవన్ లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. సంధ్య థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి బస్ భవన్ వద్దకు వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్టీసీ ఎండీని కలవడానికి కేవలం ముగ్గురు బీఆర్ఎస్ నేతలకు మాత్రమే అనుమతి ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో అప్పటికే అక్కడకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నిరసనలకు దిగారు. పలువురు బారికేడ్స్ ను తోసుకుంటూ బస్ భవన్ వైపు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హరీశ్ రావు, కేటీఆర్ వెళ్లి ఆర్టీసీ ఎండీకి వినతి పత్రాన్ని అందించడం గమనార్హం.
హరీశ్ రావు ఫైర్..
అంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చి చలో బస్ భవన్ కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 20 నెలల్లో 5సార్లు బస్ ఛార్జీలు పెంచారన్న ఆయన.. భార్య ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జీవో 53, 54 ద్వారా కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ ను పెంచి.. ప్రజలపై రేవంత్ సర్కార్ భారం మోపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద హై టెన్షన్..
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్
బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దకు చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు
భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
కేటీఆర్, హరీష్ రావుని లోపలికి అనుమతించిన పోలీసులు
పార్టీ కార్యకర్తలను అనుమతించకపోవడంతో ఆందోళనకు… pic.twitter.com/J8CQTlR1JI
— BIG TV Breaking News (@bigtvtelugu) October 9, 2025
‘ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర’
బస్ భవన్ వద్దకు రావడానికి బస్సులో ప్రయాణించిన కేటీఆర్ సైతం రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తరుపున తాము స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. కానీ బస్సుల్లో ఇప్పుడు మహిళలకు సైతం సీట్లు దొరకని పరిస్థితి తలెత్తిందని అన్నారు. అయితే మహిళలకు ఫ్రీ అని చెప్పి.. పురుషులకు ఛార్జీలను డబుల్ చేయడం, బస్సుపాస్ ధరలు పెంచడం ఏంటని నిలదీశారు. దీని వల్ల సామాన్యులపై భారం పడదా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని చూపించి ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చినం
మహిళలకు ఉచితం అని
పురుషులకు టికెట్ల రేట్లు డబుల్ చేస్తే..
బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా?పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని… pic.twitter.com/SPcfWGMspW
— BRS Party (@BRSparty) October 9, 2025
Also Read: Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘SSMB29’ టైటిల్ ఇదేనా!..
బస్ భవన్ వద్ద 600 పోలీసులు
మరోవైపు బీఆర్ఎస్ చలో బస్ భవన్ కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఆర్టీసీ పరిపాలనా కార్యాలయన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బస్ భవన్ కు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేసి.. 600 మందికి పైగా పోలీసులను అక్కడ మోహరించారు. అయితే నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఇవాళ హైడ్రామా నెలకొనడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ రోడ్డు కాకుండా చుట్టూరు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
కాసేపట్లో ఆర్టీసీ భవన్ వద్దకు రానున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు
ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాల బందోబస్తు pic.twitter.com/4jBjALa6sH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 9, 2025
