Harish Rao ( IMAGE CREDIT: TWITTER)
Politics, లేటెస్ట్ న్యూస్

Harish Rao: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

Harish Rao: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందుల పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సి ఉండగా, పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం అన్నారు.

రూ.330 బోనస్ ను రైతులకు అందించడంలో విఫలం

తెలంగాణలో సుమారు 7లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, పంట కోతకు వచ్చి మక్కలను మార్కెట్లలోకి తరలిస్తున్నారన్నారు. దాదాపు అన్ని మార్కెట్ యార్డులు మొక్కజొన్న నిల్వలతో నిండిపోయాయన్నారు. కానీ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారని, క్వింటాలుకు రూ.2400 మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరు చెల్లిస్తామన్న రూ.330 బోనస్ ను రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

 Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!

గత రెండేళ్లుగా బోనస్ డబ్బులు ఊసు లేదు 

ప్రభుత్వ నిర్లక్ష్యంతో తక్కువ ధరకు రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్ మక్కలను రూ.1600కే రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తారని, ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లి వారి కష్టమంతా దళారుల పాలవుతున్నదన్నారు. గత రెండేళ్లుగా బోనస్ డబ్బులు ఊసు లేదని, ఇటు మద్దతు ధర రాక.. అటు బోనస్ లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారన్నారు. రైతుల కష్టాలు కనిపించడం లేదా?వారి రోదన మీకు వినిపించడం లేదా? అని నిలదీశారు. రైతుల ఏడుపు, అన్నదాతల ఆవేదన కంటే మీకు కక్ష రాజకీయాలే ముఖ్యమా? అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్విoటాల్ కు 2400తోపాటు రూ.330 బోనస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇంటర్ గెస్ట్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలి

సీఎం సొంత జిల్లా వికారాబాద్ లో 9 నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గం అని హరీష్ రావు మండిపడ్డారు. బతుకమ్మ, దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిష్టి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుందని, కుటుంబ పోషణ ఎలా జరుగుతుందన్నారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో, ఓపిక నశించి కళాశాలకు వెళ్లకూడదని నిర్ణయించున్నారన్నారు.

విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు?

లెక్చరర్లు కళాశాలలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు? సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారు? అని నిలదీశారు. నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు, విద్యార్థులు నష్టపోవాల్సి వస్తున్నదన్నారు. పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం..ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందన్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు అన్నారు. కోతలు కోయడం ఆపేసి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కళాశాలల గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Group 1 Controversy: గ్రూప్-1 వ్యవహారంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?