Peddi Update
ఎంటర్‌టైన్మెంట్

Peddi Update: పూణేలో జాన్వీతో రామ్ చరణ్ రొమాన్స్.. తాజా అప్డేట్ ఇదే!

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi Movie)కి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) సినిమా విడుదలకు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో.. సేమ్ టు సేమ్ ‘పెద్ది’ సినిమాపై కూడా అలాంటి హైపే ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మెగా ఫ్యాన్స్ అందరూ బుచ్చి మామ తమకు అదిరిపోయే హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే..

Also Read- Mohan Babu University: కోర్టు ఉత్తర్వును ధిక్కరించారు.. కాంట్రవర్సీపై మంచు విష్ణు స్పందనిదే!

తాజా అప్డేట్ ఇదే..

గురువారం (అక్టోబర్ 9) నుంచి ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ పూణేలో ప్రారంభం అవుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం టీమ్ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పై అద్భుతమైన పాటను చిత్రీకరించనున్నారట. అకాడమీ అవార్డు విన్నర్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అదిరిపోయే సాంగ్‌ని కంపోజ్ చేశారని, ఈ సాంగ్‌కి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌‌గా జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ ప్యాషన్‌తో పనిచేస్తోందని, కచ్చితంగా చెప్పిన డేట్‌కి రిలీజ్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది.

Also Read- War 2 OTT: అఫీషియల్.. ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి ‘వార్ 2’

రామ్ చరణ్ పుట్టినరోజునే..

ఈ సినిమాలో తన పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 27 మార్చి, 2026న ఈ సినిమా గ్రాండ్‌గా పాన్-ఇండియా స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ నుంచి వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో, రామ్ చరణ్‌తో పాటు, ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!